బాహుబలి తో నాన్నకు ప్రేమతో కంపేరిజనా..?

12 Jan 2016


      జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్ కోసం టీమ్ ఆపసోపాలు పడుతోంది.ఐతే ఆ  సందర్భంగా వాళ్లు చేస్తున్న కామెంట్లు ఒకింత కామెడీ కూడా పండిస్తున్నాయనడంలో సందేహం లేదు..జగపతిబాబు ఓ ఇంగ్లీష్ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలితో తమ సినిమాను పోల్చడం ఆనందంగా ఉందన్నాడు..అసలు అడిగిన వారికి లేకపోతే..ఈయనకేమైందని అనుకోకతప్పదు..ఎందుకంటే..బాహుబలి కథలో ఉన్న విశ్వజనీనత..అలానే ఓ జానపద సినిమా కావడంతో దానికి ఉన్న స్కోప్ విస్త్రతమైనది..గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉండటంతో అందరినీ అలరించి 500కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగింది..ఆ సినిమాతో జూనియర్ సినిమా పోల్చడం కామెడీగానే అన్పిస్తుంది మరి..! 

Nannaku Prematho team is in very busy in movie promotions. But they selected different way to promote their movie. They are comparing their movie with Bahubali.