నాన్నపై ప్రేమతో..ప్రిన్స్

14 Jan 2016           సూపర్ స్టార్ మహేష్ కు మరో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రాణం..ఆయన ఎదురుగా  నటించడం తనకు చేతకాదని ఫ్రాంక్ గా చాలా సందర్భాల్లో చెప్పేశాడు కూడా..! ఐతే 1980ల్లో వచ్చిన పోరాటం సినిమాతో తెరంగ్రేటం చేసిన మహేష్..ఆ తర్వాత శంఖారావం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, అన్న-తమ్ముడులో కృష్ణతో నటించి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు..బాలచంద్రుడు అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు..ఆ సినిమాకు డైరక్షన్ చేసింది కృష్ణనే.! సోలో హీరో అయిన తర్వాత రాజకుమారుడు,టక్కరిదొంగ రెండు సీన్స్ లో..వంశీలో ఫుల్ ప్లెడ్జెడ్ గా ఈ ఇద్దరు సూపర్ స్టార్లూ తెరపంచుకున్నారు..ఈ హిస్టరీ అంతా ఎందుకు చెప్తున్నామంటే..సూపర్ స్టార్ కృష్ణ తాజాగా శ్రీశ్రీ అనే ఓ సినిమాలో నటిస్తున్నారు..ఆ సినిమాకు వాయిస్ ఓవర్ ప్రిన్స్ ఇవ్వబోతున్నాట్ట..ఈ న్యూస్ లీక్ అవడం ఆలస్యం కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు..ఎందుకంటే..మహేష్  ఎదుగుదలను,కృష్ణ ఎలాగైతే..ప్రతీ దశనూ దగ్గరుండి చూసుకున్నారో..అభిమానులు కూడా అదే విధంగా గమనిస్తూ వచ్చారు..అలాంటిది తండ్రి సినిమాకు కొడుకు గొంతు ఇవ్వడం వారిని సంబరాలు చేసుకునేలా చేస్తోంది..
         జల్సా, బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన మహేష్ ఇప్పుడు తానెంతగానో అభిమానించి..ప్రేమించే కృష్ణ సినిమాకు కూడా ఇవ్వనుండటం డెఫినిట్ గా గ్రేట్ ..లాంగ్ గ్యాప్ తర్వాత ఫిట్ గా..గ్రేషియస్ గా కన్పిస్తున్న సూపర్ స్టార్ స్టిల్స్ ఇప్పటికే శ్రీశ్రీ సినిమాపై ఓ అంచనాను కలిగిస్తున్నాయ్..ఇప్పుడీ న్యూస్ తో అవి ఇంకాస్త పెరుగుతాయనడంలో సందేహం లేదు..ఏమో ఈ సినిమా తర్వాత నటశేఖర కృష్ణ మళ్లీ ఓ వెలుగు వెలిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ఫ్యాన్స్


Mahesh Babu is famous hero in Tollywood. He loves his father Super Star Krishna very much. Now he is giving voice to Krishna movie. He already gave voice to Jalsa and Badsha movie.