ఇదేనా ఎన్టీఆర్ పై ప్రేమ

13 Jan 2016


             
              వైఎస్సార్ మానసపుత్రిక అయిన రాజీవ్ ఆరోగ్యశ్రీను ఏపీ ప్రభుత్వం అటక ఎక్కిస్తోంది..ఇది గిట్టనివారి మాట  కాదు..సాక్షాత్తూ వారికి అనుకూలంగా రాసే పత్రికలోని వ్యాసాల సారాంశమే ఇది..అసలు దేశనేతల పేర్లతో మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వైఎస్..ఐతే ఆ పథకాల పేర్లెత్తితే చాలు వైఎస్సార్ గుర్తొస్తారనే కుళ్లుతో..ఆ పథకాల పేర్లన్నీ మార్చేసింది టిడిపి ప్రభుత్వం ఇది నిజం..కాకపోతే..అవే పథకాలకు పేర్లెందుకు మార్చుతారు..సరే ఇదంతా వేరే సబ్జక్టు అనుకోండి..ఇప్పుడైతే ఎన్టీఆర్ వైద్యసేవ పేరుతోనే ఆరోగ్యశ్రీ అమలు అవుతోంది.. ఐతే కర్నూలు జిల్లాలో కనీసం మందులు కూడా లేకుండా ఈ సేవ కునారిల్లుతోంది..చికిత్స చేయించుకున్నా..మందులు మాత్రం దొరకకపోవడంతో పేదలు ఇక వీటికి దూరంగా జరిగిపోతున్నారు..జిల్లాకు నిధులు భారీగా ఉన్నా అవి విడుదల కాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని తెలుస్తోంది..పేరు మార్చి ఏదో గొప్ప సేవ చేయాలనుకున్న టిడిపి..ఇప్పుడు మరి ఎన్టీఆర్ ఆరోగ్యసేవకు గ్రహణం పట్టిన సంగతి ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి..అంటే  పేరు..ప్రచారానికి ఎన్టీఆర్ అవసరం కానీ..రోడ్లపై విగ్రహాలపై రెట్టలు వేస్తున్నా పట్టించుకోనట్లే..పథకాలు అమలు కాకపోయినా చూస్తుండి పోతారన్నమాట..

Now Rajiv Arogyasri name is changed as NTR arogya seva by TDP goverment to exhibit love on NTR. But is program is neglecting by this government, event it dont have tablets.