టిడిపికి అంత సీన్ లేదా?

12 Jan 2016

         గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఎస్ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు స్పందించిన తీరు చూస్తే అలానే ఉంది..మేయర్ పీఠం మాదే..కాదనేవాళ్లు రాజీనామా చేస్తారా అంటూ ఆయన చేసిన ఛాలెంజ్ కు ఏదోలా కౌంటరివ్వాలనుకున్నారో ఏమో కానీ..ఒకరు తమ చేతగానితనాన్ని బైటపెట్టుకుంటే..మరొకరు అదో జోక్ అంటూ ప్రకటించారు.. సీనియర్ నేత ఎర్రబెల్లి ఈ సవాల్ పై మాట్లాడుతూ..ఖచ్చితంగా వంద సీట్లు గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవాలి..అప్పుడే ఆ సవాల్ ను స్వీకరిస్తామంటూ అన్నారు..అంటే ఏ 80 సీట్లో..70సీట్లో రాకూడదట..ఖచ్చితంగా సెంచరీ కొడితేనే కేటీఆర్ చెప్పినట్లు టి.టిడిపి అంతా రాజీనామా చేస్తామని ఆయన అర్ధమా..ఈ మాటలను చేతకాని తనం అనక ఇంకేమంటారు మరి.. ఇక గ్రేటర్ టిడిపి ప్రెసిడెంట్ మాగంటి గోపీనాధ్ తీరు వేరు..కేటీఆర్ మాటలు జోక్ అంటూ కొట్టిపారేయబోయాడాయన.. ఏదైనా ఛాలెంజ్ విసిరితే ధీటుగా ఎదుర్కోవడం మానేసి..పారిపోవడం వీళ్లకే చెల్లిందంటున్నారు గ్రేటర్ వాసులు


GHMC elections notification was released. Telenagana minister KTR gave open challenge about GHMC elections, that they will get 100 seats. So what about TDP party, is it doen't have that type of seen.