కేటీఆర్ సెటిలరా..?

12 Jan 2016


            మంత్రి కేటీఆర్ సెంటిమెంట్ తో సీమాంధ్రులకు ఆయింట్ మెంట్ పూసే పనిలో పిచ్చబిజీగా మారిపోయాడు..తొందర్లోనే సిఎం పీఠం తీసుకుంటాడు..పట్టాభిషేకం జరగుతుంది అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కేటీఆర్..గ్రేటర్ ఎన్నికలను లిట్మస్ టెస్ట్ గా తీసుకున్నట్లు కన్పిస్తోంది..ఇప్పటికే రకరకాల ఛాలెంజ్ లు..హామీలు గుప్పిస్తున్న ఆయన తాజాగా మరో రెండు అస్త్రాలు హైదరాబాద్ పరిధిలో ఉంటున్న సీమాంధ్రులకు విసిరాడు..అందులో ఒకటి డిప్యూటీ మేయర్ పదవి ఒకటైతే..రెండోది నేనూ సెటిలర్ నే అనడం..అసలు సెటిలర్ అనే పదాన్ని కోర్టే నిషేధించినా..వాడొద్దని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు..ఆ సంగతి పక్కనబెడితే..ఇప్పుడాయన కూడా సిధ్దిపేటనుంచి వచ్చి స్థిరపడినవాడినే అంటూ బిల్డప్ ఇవ్వడం బిగిన్ చేసాడు..ఆ సంగతి తెలంగాణ అంటూ రొమ్ములు బాదుకునేవాళ్లకీ అర్ధమైతే..గ్రేటర్ పరిధిలో ఇంత హడావుడే ఉండేది కాదు..అక్కడికేదో సీమాంధ్రప్రాంతవాసులే ఇక్కడ  నాన్ లోకల్ అయినట్లు మిగిలినవాళ్లంతా లోకల్ అయినట్లు నానాబీభత్సం గత పదేళ్లలో సృష్టించారు వాళ్లు..తీరా ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్లు వచ్చేసరికి నేనూ ఆ తానులో ముక్కనే అంటూ సెంటిమెంట్ రంగరిస్తున్నారు..అంతేనా లేక..ఇలా ఆయన డెఫినిషన్ ప్రకారం సెటిల్ అయినవాళ్లకే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారా..ఎందుకంటే వాళ్లనాయన కూడా ఇలానే దళితుడికి ముఖ్యమంత్రి పదవి అంటూ ఊదరగొట్టి చివరకు ఏం చేసారో అంతా చూశారు కదా..

KTR taking total responsibility of GHMC elections. And he gave an open challenge about TRS success in elections. So KTR trying to impress Telangana Settlers, and said i am also settler.