సిఐఐలో బాబు భజన

12 Jan 2016


          ఏపీలో వ్యాపారవేత్తల భాగస్వామ్యసదస్సు బాబుగారి భజనతో మార్మోగిపోతోంది..అందులో పెట్టుబడులు పెట్టడానికి..ఇండస్ట్రీలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారు అంతవరకూ బాగానే ఉంది..ఐతే అక్కడకు వచ్చిన ఇండస్ట్రియలిస్టులతో పాటు కొంతమంది మంత్రుల తీరు మరీ అతిగా ఉందంటున్నారు..సిఐఐ మీట్ మూడో రోజున ప్రసంగించిన కేంద్రమంత్రి అనంతకుమార్ చంద్రబాబు అయస్కాంతంలాంటి వారని..పెట్టుబడులు తెగ ఆకర్షిస్తారని అన్నారు..అది నిజమే కావచ్చు కానీ..ఏ వ్యాపారస్థుడికైనా..ఎక్కడ లాభం ఉంటే అక్కడ వ్యాపారం చేసుకుంటారు..ఇందులో ఒకరి గొప్ప ఏం ప్రత్యేకంగా ఉండదు..ఇప్పుడు ఏపీనే కాదు..ఏ రాష్ట్రంలో ఇలాంటి సదస్సులు పెట్టినా కనీసం లక్షకోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రకటనలు వస్తుంటాయ్..ఏపీలో ఇండస్ట్రీలు పెరగడం ఎవరూ వద్దనరు..పైగా ఆహ్వానిస్తారు కూడా..! ఐతే ఇక్కడ మరో నేత ఇటీవలే పార్టీలో పదవి దక్కించుకున్న కొంతమంది నేతల భజన కూడా బోలెడంత వినోదాన్ని పంచుతోంది.. సీఐఐ సదస్సు ద్వారా దళిత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై పరిశీలించామని జూపూడి ప్రభాకర్ చెప్పడం భలే కామెడీ క్రియేట్ చేస్తోంది..అసలు ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగిందో ఆయన చెప్పాలని కొంతమంది మాలమహానాడు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.. పైగా ఆ సదస్సు ద్వారానే  దళిత విద్యార్థులకు ట్రైనింగ్ ..  తర్వాత ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామనడం నమ్మేలానే ఉందా...ఉన్న ఉద్యోగాలే ఊడబీకుతుంటే ఇలా బిల్డప్ ప్రకటనలతో లాభం లేదంటున్నారు.పైగా ఏపికి బాబే బ్రాండ్ అంబాసిడర్..బాబే పెద్ద మ్యాగ్నెట్ వంటి పొగడ్తలతో పెద్దగా ఏం ఒరగకపోయినా.. రేపు ఏదైనా డ్యామేజీ అయితే బాబే పెద్ద బ్యాండ్ అనగల ప్రమాదమూ  ఉంది..

In Andhra Pradesh CCI meet is conducting since last three days. But the CCI meet is only for praising CM. All state and central minister are praising Chandra Babu.