నేనే నమ్మలేకపోయా

26 Jan 2016


               రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పురస్కారాలపై వాటి గ్రహీతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. దర్శకుడు రాజమౌళి చెప్పడం ప్రకారం. ఈ పురస్కారాల కోసం ఏపీ గత ఏడాదే ఆయన్ని సంప్రదించిందట. ఐతే వద్దని చెప్పడంతోనే ఆ ఏడాది ఎంపిక చేయలేదని చెప్పారాయన. అది ఆయన సంస్కారానికి నిదర్శనంగా చెప్పాలి. ఐతే ఈ ఏడాది మాత్రం పద్మశ్రీ రావడం సర్ ప్రైజింగ్ గా ఉందన్నారు. ఐతే రాజమౌళిని నామినేట్ చేసింది కర్నాటక ప్రభుత్వమట ఇదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు రాజమౌళి కర్నాటకవారా, ఏపీ వారా, హైదరాబాదీ కాబట్టి తెలంగాణవారా. 

      ఇదే చర్చకు దారి తీస్తోంది. ఐతే అతన్ని ఓన్ చేసుకునేందుకు ఏపీ, కర్నాటక తప్ప ఆయన చెప్పుకుంటున్నట్లు తెలంగాణవారు మాత్రం ఎప్పటికీ సొంతం చేసుకోలేరు. ఐతే ఏపీ నుంచి  అవార్డు దక్కితే అది ఖచ్చితంగా వివాదాస్పదం అయ్యేది ఎందుకంటే ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను కొన్ని గతంలో ఆయన దర్శకత్వంలో రూపొందించారు. అలానే టిడిపి ప్రచార సిడీలను కూడా జక్కన్నే రూపొందించారంటారు. వాటికి బదులుగానే ఇలా పద్మ దక్కిందనే విమర్శలు వచ్చేవి. ఐతే ఈ గౌరవానికి తాను అర్హుడిని కాదని చెప్పడం ద్వారా తన వినమ్రత చాటుకున్నాడు రాజమౌళి
Bahubali director Raja Mouli got Padma sri award. Actually Ap government consulted him last year to recommend for this, but he was refused. But this year he was recommended by Karnataka government.