గుడ్ న్యూస్.

23 Jan 2016


     ఏపీలో ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ ఉద్యోగాలొస్తున్నాయ్..ఇదేదో కొత్త డిఎస్సీ ప్రకటన అనుకోకండి. 2014 సంవత్సరంలో డిఎస్సీ రాసి ఉద్యోగాలకు అర్హత సాధించినవాళ్లకి లైన్ క్లియర్ అయింది. దాదాపు రెండేళ్ల నుంచీ తమ ఉద్యోగాల కోసం 8వేలమంది పైగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో వీరికి అప్పాయింట్ మెంట్లు ఇస్తామని మంత్రి గంటా ప్రకటించారు. ఐతే కేవలం 8,086 పోస్టులకు మాత్రమే కోర్టు అనుమతి వచ్చిందని ఆయన చెప్పడంతో. మిగిలిన పోస్టుల సంగతి ఇప్పుడే తేలేట్లు లేదు. అంటే ఇంకా వేలాదిమంది తమ ఉద్యోగాల కోసం ఎదురుచూపులు తప్పవని ఉస్సూరంటున్నారు. 
            స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి కోర్టుకు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం వెతకాలని ఉద్యోగార్ధులు కోరుతున్నారు. ఎందుకంటే 2014లో డిఎస్సీ రాస్తే. రెండేళ్లకు కూడా భర్తీ చేయలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. ఎప్పుడు డిఎస్సీ రాసినా తర్వాత మూడేళ్లకు కానీ పోస్టుల్లో చేరలేని నిస్సహాయతకు పరిష్కారం వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Good news to AP un employees, AP government releasing DSC posts. But this is not new notification, it releasing 2014 notification posts.