టిడిపి+బిజెపి=కలవని మనసులు

22 Jan 2016


                  పైకి దోస్తీ..లోపల కుస్తీ..ఇలానే ఉంది టిడిపి బిజెపిల మైత్రీ వ్యవహారం..గ్రేటర్ ఎన్నికలు హైదరాబాద్ లో ఈ రెండు పార్టీల విబేధాలను క్లియర్ గా బైటపెడుతున్నాయ్..సీట్ల సర్దుబాటు సమయంలోనే తాము ఎక్కడైతే ఓడిపోతామో ..ఖచ్చితంగా అక్కడే సీట్లు కేటాయిస్తున్నారంటూ బిజెపి నేతలు టిడిపిపై ఆరోపణలు చేశారు..ఇప్పుడు నామినేషన్ల తంతు దగ్గరా అదే తీరు..బీఫామ్స్ సంగతి మాకెందుకు ముందు మేం నామినేషన్లు వేయాల్సిందే అన్నట్లు రెండు పార్టీల చోటా నేతలు వేసేశారు.. పైకి మాత్రం ముందస్తుగా అనుకున్నట్లుగానే సీట్ల స్వాపింగ్ జరుగుతుందని చెప్తున్నారు.. 
           ఐతే బిజెపికి హబ్సిగూడ,రహమత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, పటాన్ చెరు,జీడిమెట్లలో అనుమతి లేకపోయినా పోటికి సై అన్నారు..ఇప్పుడు అక్కడ టిడిపి వాళ్లు వెనక్కి తగ్గి కమలనాధులకే వదిలేశారు..అలానే అడిక్ మెట్, అమీర్ పేట, సుభాష్ నగర్, జూబ్లీహిల్స్ , మాదాపూర్ లో బిజెపి నేతలు నామినేషన్లు వేశారు..ఇందులో గ్రేటర్ టిడిపి ప్రెసిడెంట్ మాగంటి గోపీనాధ్ నియోజకవర్గ పరిధే ఎక్కువ..ఐనా వాళ్లు నామినేషన్లు వేయడం ఈ దోస్తీ కుస్తీ వ్యవహారానికి పీక్ స్టేజ్..చివరకు మళ్లీ ఈ ఐదింటిలో టిడిపినే నిలుచునేలా చేశారు..ఇప్పుడిలా ఉంది..ఇక అసలు కథ రేపు పోలింగ్ రోజు తేలుతుందంటున్నారు వీరి వ్యవహారం గమనించిన గుసగుసరాయుళ్లు


In GHMC elections TDP and BJP parties are working together. But their parties only working with each other, leaders are not working with each other they are till fighting for seats.