శవరాజకీయం

20 Jan 2016


         ఖచ్చితంగా ఇదే పదం గుర్తొస్తోంది సెంట్రల్ యూనివర్సిటీలో పార్టీల తీరు చూస్తుంటే..ఒకరేమో మాకేం సంబంధం లేదంటూ దులుపుకుపోతుంటే..ఇంకొకరేమో ఆఘమేఘాల మీద ఢిల్లీ నుంచి దూసుకొచ్చేశారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంత రాజకీయం రంగు పులమవద్దని చెప్తున్నా..ఆటోమేటిగ్గా జరగాల్సిన పనులు జరిగిపోయాయ్..కాంగ్రెస్ రాష్ట్ర నేతలంతా రాహుల్ కు దడి కట్టి మరీ యూనివర్సిటీలో రోహిత్ తల్లిదండ్రులు..బంధువుల పరామర్శలో తేలిపోయారు..రోహిత్ (ఆత్మ)హత్యోదంతం..ఇక్కడ ఆత్మహత్య కాకుండా హత్యోదంతం ఎందుకంటున్నామంటే..అతనితో పాటు..మరికొంతమందిని కళాశాల హాస్టల్ ప్రాంగణం నుంచి వెలివేయడమేంటని ఎవరూ  ప్రశ్నించలేదు..పైగా అన్ని రోజులు వెలివాడ పేరుతో టెంట్లు వేసుకున్నప్పుడూ ఘనత వహించిన కమ్మపెద్దలు తమ్మినేని వీరభద్రం అటువైపు రాలేదు..ఇప్పుడు గొంతు చించుకుంటున్న స్టూడెంట్లూ వారికి మద్దతుగా రాలేదు..ఇప్పుడు మాత్రం ఎక్కడ ఓట్ల వేటలో వెనుకబడతామేమో అన్నట్లుగా పరామర్శలు..నినాదాలతో హోరెత్తించేశారు..అసలు మనిషనేవాడు ఎక్కడకు పోయాడనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే..ఇదే కాదు అసలు ఎక్కడ ఎలాంటి ఘోరం జరిగినా పదుల సంఖ్యలో వాలిపోతుంటారు..ఫోటోలకు వీడియోలకు ఫోజులిస్తుంటారు..అంతేకానీ ఆ అన్యాయమో..విషాదం మొలకగా ఉన్నప్పుడో ఏ మాత్రం సాయం చేయరు..మద్దతు పలకరు..ఇంతమంది ఎంత పెద్ద ఎత్తున ఎలుగెత్తినా ఓ ప్రాణం తిరిగి వస్తుందా..కాంగ్రెస్ పార్టీ నేతలంతా రాహుల్ వెంట క్యూ కట్టి వచ్చేశారు..రేపు ఇంకో పార్టీ వాళ్లు.. ఆ తర్వాత మరో పార్టీ..వీళ్లంతా అసలు పరామర్శలకు తమకు ఓ  అవకాశం ఎప్పుడు  దొరుకుతుందా అన్నట్లు ఎదురు చూస్తుంటారేమో అన్పించకమానదు..అందుకే క్యాంపస్ లో శవరాజకీయం కంపు కొడుతోందిప్పుడు.

Present hot new in media is HCU student Rohit suicide. Here all parties are doing politics using this incident. Some of the leaders are saying dont do politics and they are doing it in back door.