అందరికీ అనసూయే కావాలి

25 Jan 2016


             యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ హవా ఇప్పుడు విపరీతంగా నడుస్తోంది. ఆమె ఫాలోయింగ్ దేశం కూడా దాటిందని. దుబాయ్ లో ఓ ప్రవేట్ ఛానల్ నిర్వహించిన అవార్డ్స్ ఫంక్షన్ లో తెలిసింది. ప్రోగ్రామ్ లో అంతా మిమక్రీ, డ్యాన్స్ షోలే నడిచాయ్. ఐతే మధ్యలో బుల్లెట్ భాస్కర్, రఫీ స్కిట్స్ పాపం సెలబ్రెటీ ఆడియెన్స్ ను ఇబ్బంది పెట్టాయ్. కృష్ణంరాజును ఇమిటేట్ చేసిన రఫీ వాడిన పదజాలం చీప్ గా ఉండటంతో కృష్ణంరాజు అసహనంగా చూస్తూ కన్పించాడు దాంతో పాటు మధ్యమధ్యలో సుమని అక్కడి కుర్రాళ్ల కేకలతో అరుపులతో విసిగించగా వాళ్ల అరుపుల సారాంశం అనసూయ కావాలి అని అనసూయ కావాలా ఏం మీ పెళ్లాలు పక్కన లేరా అంటూ సుమ కవర్ చేయబోయి నాలిక్కరచుకుంది. 
            అలా నాలుగైదు సార్లు జరిగిన తర్వాత అనసూయ హాట్ హాట్ గా స్టెప్పులేసి దుబాయ్ఆడియెన్స్ ను అలరించింది. ఆమె డ్యాన్స్ చేస్తున్నంత సేపూ యూత్ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం వరకూ బాగానే ఉంది. కానీ కొంతమంది యూత్ మాత్రం వెకిలి సైగలు చేయడం కూడా చోటు చేసుకుంది. ఐతే  అనసూయ మాత్రం వాటిని పట్టించుకున్నట్లు లేదు. రకరకాల క్యాస్టూమ్స్ లో నిండుగా దుస్తులు వేసుకున్నా. శృంగారదేవతలా కన్పించిందంటూ కొంతమంది ఈ ముదురు ముద్దుగుమ్మపై కామెంట్లు చేశారు.

Anchor Anasuya got more popularity with in short time. She started her carrier with anchoring, now she entered in to movies. In an award function which was conducted by a private channel. All the fans are asking Anasuya anchoring.