వైఎస్ నామస్మరణలో కాంగ్రెస్

14 Jan 2016


              చనిపోయి ఏడేళ్లు అవుతున్నా దివంగత నేత వైఎస్ రాష్ట్రరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని మరోసారి ప్రూవైంది..గ్రేటర్ లో పార్టీ పటిష్టతపై పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పోటీనుంచి విరమించుకోవడంతో..ఇదే సందనుకుని కాంగ్రెస్ పార్టీ వైఎస్ పేరు వాడుకోవాలనుకుంటుందా..అంటే ఔననే అన్పిస్తోంది..ఎన్నికల ప్రచారంలో కాన్వాసింగ్ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అసలు హైదరాబాద్ అభివృధ్ది వైఎస్ సహకారంతోనే కాంగ్రెస్ చేయగలిగిందని చెప్పుకొచ్చారు..ఇప్పుడు కేసీఆర్ చెప్పుకుంటున్న కృష్ణాజలాల తరలింపు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలు ఆయన హయాంలో జోరుగా జరిగాయని చెప్పారాయన. కేంద్రపట్టణాభివృధ్ది మంత్రిగా జైపాల్ రెడ్డి పని చేసిన సమయంలో హైదరాబాద్ లో 76వేల ఇళ్ల పంపిణీ జరగగా.. జంటనగరాలకు నీటి సరఫరా కోసం 600కోట్లు ఖర్చు పెట్టారు..ఇదంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుదలతోనే సాధ్యమైందంటారు..ఇదే అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్..సహా ఆ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు చెప్తుంటారు..ఐతే అటు అధికారపక్షం  కానీ..విపక్షాలైన టిడిపి,బిజెపిలు మాత్రం ఈ అంశాన్ని కన్వీనెంట్ గా మర్చిపోతుంటారు..ఇప్పుడు కేంద్రమాజీ మంత్రే చెప్పడంతో..నిజాన్ని ఒప్పుకున్నట్లైంది..అందుకే చాలామంది గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీకి దిగి ఉంటే పరిస్థితి బావుంటుందని ఆ పార్టీ అభిమానులు భావిస్తుంటారు.

Now Hyderabad is in hot with GHMC elections. for that leaders are doing different things. Congress repeating YS Rajshekar Reddy name to attract voters.