బాబాయ్-అబ్బాయ్ మీకో దండం

12 Jan 2016


         పొంగల్ పోరు థియేటర్ల యాజమాన్యాలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది..బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ తో ఇది మరింత ముదిరిందంటున్నారు..ఎవరికి ప్రాబల్యమున్న చోట వారు సినిమా థియేటర్లను ఆక్రమించేసి..రెండోవారికి షో వేసుకోవడానికి థియేటర్లు లేకుండా చేస్తున్నారు..ఈ పోరులో దిల్ రాజు చేతిలో ఉన్న డిక్టేటర్ సినిమా పేరు ఎక్కువగా విన్పిస్తోంది..బాలయ్యకే థియేటర్లు ఇవ్వాలని ఇంకెవరికి  ఇచ్చినా ఊరుకునేది లేదంటూ వార్నింగులెళ్లాయని టాక్..ఐతే కృష్ణాజిల్లాలో బుడ్డోడి ఫ్యాన్..బాగా క్లోజైన ఓ ఎమ్మెల్యే ఉండటంతో ఇక్కడ మాత్రం ఆ ఆటలు సాగకపోగా..రివర్సైనట్లు తెలుస్తోంది..ఐతే వీరిద్దరి మధ్య పోరులో థియేటర్ల ఓనర్లు నలిగిపోతున్నారట..ఎవరికి ఇస్తే ఏమవుతుందో అని..మల్లగుల్లాలు  పడుతున్నారు..
To this pongal Jr NTR movie Nannaku Prematho, Balakrishna Movie Dictator are going to release. So a cold war is running between both of them for theaters. Between them theaters owners are facing problems.