వీళ్లకి ఊస్టింగ్ తప్పదా..?

13 Jan 2016


                కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులుంటాయని ప్రచారం ఢిల్లీలో జోరుగా విన్పిస్తోంది.. మంత్రిపదవులు అనుభవిస్తున్నవారిలో కొంతమంది రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతున్న నేపధ్యంలో ఈ మార్పులు తప్పవని టాక్.. వారిలో ప్రముఖంగా విన్పిస్తోంది మన తెలుగు మంత్రుల పేర్లే..వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి  రాజ్యసభ సభ్యత్వాలు త్వరలోనే ముగుస్తున్నాయ్. కేంద్రమంత్రి వెంకయ్యకు ఉన్న పరపతి దృష్ట్యా ఆయనకు ఢోకా లేదనుకోవచ్చు కానీ..సుజనాచౌదరికే మరో టర్మ్ అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది..కేంద్రమంత్రి వెంకయ్య విషయానికి వస్తే..మాటలగారడీతో ప్రసంగాలతో ఊదరగొడుతుండటం ఆయన హాబీ...పార్లమెంట్ లోపల..బయటా ఏపీకి చాలా చేస్తున్నామని చెప్పడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది..సాయం వచ్చేదెంతో..వచ్చిందెంతో తెలియదు కానీ.. బిజెపి స్థానిక నేతలు కూడా ఆంధప్రదేశ్ అభివృధ్దికి మేం చేసినంత ఎవరూ చేయలేదని చెప్తుంటారు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని సాకుగా చూపించి..ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులపై వేటు పడొచ్చని అంటున్నారు..వీరిలో రాధా మోహన్ సింగ్(వ్యవసాయ శాఖ),  ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం సహజవాయువుల శాఖ)పేర్లు బాగా విన్పిస్తున్నాయ్..తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్  అసెంబ్లీలకు ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయ్..కాబట్టి ఆ రాష్ట్రాలనుంచి కొంతమందిని మంత్రులుగా తీసుకోవచ్చని కూడా అంటారు..ఐతే ఈ ప్రచారంలో వాస్తవం ఏంటో..వచ్చే ఫిబ్రవరినాటికి తేలనుంది..


NDA government doing big changes in cabinet.  For this year some of the ministers Rajyasabha membership will ending, so they are doing changes in cabinet. In this list Telugu ministers Venkaiah Naidu and Sujana Chowdary are also there.