మోడీ కంట మొసలి కన్నీరు

23 Jan 2016


           మోడీ రోహిత్ సూసైడ్ కు సంబంధించి స్పందించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఘటన జరిగిన  ఆరురోజులకు  స్పందించడమేంటని ఎద్దేవా చేసింది. ఆ పార్టీ నేత అశుతోష్ మాట్లాడుతూ. మోడీ స్పందన మొసలి కన్నీరు పెట్టినట్లుందన్నారు. కేబినెట్ లోని మంత్రులపై ఆరోపణలు వస్తే. ఇంత తీరిగ్గా ఎవరూ స్పందించరంటూ విరుచుకుపడ్డాడు అశుతోష్. అశుతోష్ వాదనలోనూ అర్ధముంది. అసలే మోడీకి పబ్లిసిటీ యావ ఎక్కువనే ఆరోపణలున్నాయ్. అందుకే ఘటన జరిగినప్పుడు కాకుండా వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఇలా మాట్లాడారని విమర్శలు వస్తున్నాయ్. ఓ ప్రకటన కానీ. పథకం కానీ. ఏది చేసినా భారీగా మీడియాలో రావాలని ఆశించే ఇలా చేశారని ఆప్ పార్టీ విమర్శిస్తోంది.  

On HCU student Rohit suicide case today Narendra Modhi reacted. AAP leader Kejriwal fired on Naredra Modi, that it is about a week it was happen, why he is reacted today