ఎర్రబెల్లీ నీకు హళ్లా..?

25 Jan 2016


గ్రేటర్ ఎన్నికల్లో టిడిపికి అంతా తానైనట్లు బిల్డప్ ఇస్తూ రేవంత్ రెడ్డి, లోకేష్ తిరగేస్తున్నారు. ఐతే ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు గొంతు చించుకుని అరుస్తున్నా ఓటర్లలో స్పందన లేదు. లోకేష్ బొంగురు గొంతుతో కళ్లెర్రజేస్తూ చేస్తున్న ప్రచారానికి జనం ఝడుసుకుంటున్నారు. ఏమాత్రం ఆకట్టుకోని వాచకంతో లోకేష్ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం లేదంటున్నారు. ఇవేవో ఆ పార్టీనేతలపై అక్కసుతో చేస్తున్నవి కాదు. నిజంగా వాళ్లు ప్రచారం చేస్తున్న తీరు చూస్తే ఎవరికైనా ఇలానే అన్పిస్తుంది. 
           టిఆర్ఎస్ కు సీమాంధ్రులు వ్యతిరేకంగా ఉన్నారన్నేది నిజం ఐతే ఇది రేపు ఓటింగ్ లోకానీ రుజువు కాదు. కానీ దిక్కులేక టిడిపికి వేయాలా అసలు ఓటింగ్ కే దూరంగా ఉండాలా అన్నది వారింకా తేల్చుకోలేకపోతున్నారు. గతంలో వైఎస్ బతికున్నరోజుల్లో సిటీ ఎన్నికలంటే  ఉత్సాహం చూపించిన సీమాంధ్ర ఓటర్లు ఇప్పుడు ఏ మేరకు కదిలి వస్తారో అనుమానమే. ఐతే టిడిపి బిజెపి పొత్తులు కలవని మనసులకు నిదర్శనాలు. ఐతే పైన చెప్పుకున్న ఇద్దరు బాబులే తెగ బిల్డప్ ఇస్తుండగా. కాస్తో కూస్తో పేరున్న నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం టిడిపికి మైనస్ కాక ప్లస్ ఎలా అవుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఎంత జంప్ జిలానీ టైప్ అయినా. అతనితో పాటు చాలామంది నేతలు పార్టీ ప్రచారానికి రావడం లేదు. దాంతో ఎర్రబెల్లికి సున్నా పెట్టినట్లే అని భావిస్తున్నారు. మరోవైపు టిఆర్ఎస్ లోనూ ఇదే పరిస్థితి హరీష్ రావ్ కన్పించడం లేదు..ఇదంతా చూడబోతే వారసుల పట్టాభిషేకానికి పోటీనా అన్పించకమానదు..

All parties in Hyderabad are busy in campaign in GHMC elections. For TDP Revanth Reddy and Nara Lokesh are doing campaign, Reventh Reddy was accused in Note for vote and Lokesh talks was not attractive. So in TDP campaign is not well and good.