మెగా ఫ్యామిలీ అంటే యండమూరికి ఎందుకు కోపం

21 Jan 2016        ఈ మాట మేం అనడం లేదు.. యండమూరి ప్రసంగాలు ఫాలో అయ్యే ఫ్యాన్స్ అంటున్నారు..రాక్షసుడు, మరణమృదంగం,అభిలాష, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్..ఇలా కొన్ని సినిమాలకు చిరంజీవికి కథ కథనం అందించారు రైటర్ యండమూరి వీరేంద్రనాధ్. నవలా రంగంలో తనదైన ముద్ర వేసిన యండమూరికి ఒకప్పుడు పిచ్చ క్రేజ్ ఉండేది..ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్ మెంట్ కు సంబంధించిన పుస్తకాలు రాయడంలో బిజీ అయిపోయారు..నవలాకథానాయకుడు అంటే ఏఎన్నార్ తర్వాత..డిటెక్టివ్ కథలకు సూపర్ స్టార్ కృష్ణ..స్పై మూవీస్ ..క్రైమ్ ఓరియెంటెడ్ హీరోయిజానికి చిరంజీవిని కేరాఫ్ అడ్రస్ గా యండమూరి తయారు చేశారు.. ఐతే రాజకీయరంగంలో చిరంజీవి రాణించడంటూ కామెంట్ చేసి ఆయన ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టిన యండమూరి తాజాగా రామ్ చరణ్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
     రామ్ చరణ్ మొహంలో దవడ సరిగా  ఉండేది కాదని..ఆ తర్వాత సర్జరీ చేయించారంటూ ఆయన చేసిన అసందర్భవ్యాఖ్యలు ఖండనీయమే..ఎందుకంటే..పరిమితులు ఉన్నా వాటిని అధిగమించడానికి తల్లి సురేఖ,తండ్రి చిరంజీవి రామ్ చరణ్ కోసం బాగా కష్టపడ్డారని ఆయన స్టైల్లో చెప్తే..అదో పాజిటివ్ వ్యాఖ్యానంగా ఉండేది..కానీ.. రామ్ చరణ్ సహాధ్యాయి అయిన దేవిశ్రీ ప్రసాద్ మాత్రం బాగా కష్టపడేవాడని..చెప్పడం దానికి ఇళయరాజా మెచ్చుకోలు లభించిందని ఓ ఫంక్షన్లో యండమూరి వ్యాఖ్యానించారు..ఐతే రామ్ చరణ్ ప్రస్తావన సమయంలో చప్పట్లు కొట్టలేదని..దేవీ శ్రీ ప్రసాద్ పేరు చెప్పినప్పుడు మాత్రం కొట్టారని విద్యార్ధులతో అంటూ..స్వశక్తితో పైకి వస్తే వచ్చే గుర్తింపు అదీ అంటూ ఇన్ డైరక్ట్ గా రామ్ చరణ్ కు సెటైరేశాడాయన..

Yandamoori Veerendranath is a famous writer in Telugu states, he wrote so many novels and he wrote stories to movie also. Chiranjeevi got biggest hits with Yandamoori stories. Recently in a function he commented about chiru family.