...అందుకే పోటీకి దూరం

13 Jan 2016


             గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది..సిటీలో రాజకీయం జంక్షన్ లో ఉన్నందును జస్ట్ వేచి చూస్తే ఓటరు నాడిపై ఓ అంచనా వస్తుందని దానిని బట్టే తెలంగాణవ్యాప్తంగా పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..పైగా ప్రతిసారీ పోటీకి నిలవడం..అధికార పార్టీకి సాయం చేసేందుకే అన్న విమర్శలు కూడా ఈ నిర్ణయానికి రావడానికి మరో కారణంగా తెలుస్తోంది..భారీ సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్నా..ప్రత్యర్ధులు చేసే ఈ ప్రచారం దీర్ఘకాలంలో పార్టీకి చెడ్డపేరు తెస్తోందని అందుకే పోటీకి దూరంగా ఉంటే మేలనే అభిప్రాయం వ్యక్తమైన నేపధ్యంలో జగన్ ఈ డెసిషన్ తీసుకున్నారు..ఐతే గ్రేటర్ పరిధిలో దివంగత నేత వైఎస్సార్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు..వారందరికీ ఈ నిర్ణయం రుచించకపోయినా..భవిష్యత్ లో పార్టీ మెరుగుపడేందుకే ఈ పరిణామం అని సరిపెట్టుకుంటున్నారు

Recently GHMC released notification elections. But in this election YSR Congress Party decided want to stay out. It is best way to understand voters mind set.