పేలిన గన్

28 Jan 2016


              యువభేరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం భారీ ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. అలానే నిధులు, పెట్టుబడులకోసం విదేశాలు, ఢిల్లీ తిరగాల్సిన అవసరం లేదని సిఎం చంద్రబాబుకు సూచించారు. స్టేట్ కి స్పెషల్ స్టేటస్ తెస్తే పెట్టుబడుల వాటంతట అవే వస్తాయని తేల్చి చెప్పారు. కాకినాడ అంబేద్కర్ భవన్ లో భారీగా హాజరైన యూత్ ని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తుందని, ప్రభుత్వం మాత్రం ఆ ఊసే మరిచిపోయిందని గుర్తుచేశారు జగన్. 

       ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడెందుకు వాటి సంగతిని పక్కనబెట్టారని ప్రశ్నించారు. సభకు హాజరైన సీనియర్ ప్రొఫెసర్లు కూడా గత వైఎస్ పాలనతో ఇప్పటి పాలనను పోల్చారు. జాబు రావాలంటే బాబు రావాలన్ని స్లోగన్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయారని. జగన్ ప్రశ్నించినప్పుడు యూత్  భారీగా స్పందించారు...ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన పెద్దలు దానివలన పెద్దగా ప్రయోజనం లేదని మాట్లాడటంపై నిప్పులు చెరిగారు జగన్. ఆ హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ స్థాయిలో డెవలప్ అవుతుందని గుర్తు చేశారు..ఈ సభలోనే వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు, ముత్తాగోపాలకృస్ణ చేరారు.

YS Jagan commented on special status for AP and CM Chandra Babu. To attract investments no need to go states, if we get special status, investments are aromatically will come to AP. Then each district in AP will be like Hyderabad.