అసలెవడీ సుధాకర్

22 Jan 2016


          పనీపాటా లేని కొంతమంది సన్నాసులు పెద్దస్థాయిలో ఉన్నవ్యక్తులపై ఆరోపణలు,విమర్శలు చేస్తే తామూ పాపులర్ అవుతామని అనుకుంటారు..ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవతో ఎంతోమంది పదవులు అనుభవించారు..వారిలో కాంగ్రెస్ కు యూత్ ప్రసిడెంట్ గా ఓ గుంటూరు జిల్లా వ్యక్తి పనిచేశాడు..పేరు చెప్పినా కూడా అతగాడు ఎవరికీ గుర్తుకురాడు..ప్రజలు ఇచ్చిన షాక్ కి సోదిలో లేకుండా పోయిన ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అనే పదవి వెలగబెడుతున్నాడతడు.. 
              ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన జగన్ పై విమర్శలు చేస్తున్నాడీ సుధాకరుడు.. అక్కడికి వాళ్ల పార్టీ లీడర్ రాహుల్ గాంధీ వర్సిటీని వెంటనే దర్శించాడట..జగన్మోహన్ రెడ్డి లేటయ్యాడట..ఇదీ అతని కామెంట్ల సారాంశం..ఐతే ఇవాళ తాజా పరిణామం చూస్తే..ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తో పాటు సస్పెండైన నలుగురు విద్యార్ధులపై ఆ సస్పెన్షన్ ఎత్తేశారు..ఇది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిన్న ప్రస్తావించారు..వీహెచ్, భట్టి విక్రమార్క, సహా చాలా మంది నేతలు పరామర్శించారు కానీ ఈ విషయం జగన్ మాత్రమే డిమాండ్ చేశారు..అది గ్రహింపు ఉంటే ఇలా చిల్లరవిమర్శలు చేయకపోదును..అందుకే ఇప్పుడు జనం ఈడెవడండీ బాబూ అనుకుంటున్నారు.

Ex youth congress congress leader yesterday commented on YS Jagan about HCU incident. Yesterday YS Jagan visited HCU and said about suspension on remaining four students.