వెల్ కమ్ కమల్

27 Jan 2016


          కమల్ హసన్ పేరు చెప్తే అసంఖ్యాకమైన సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్లు కళ్ళ ముందు కదలాడతాయ్. సౌతిండియానే కాకుండా హోలిండియాలో కమల్ హసన్ కు అభిమానులున్నారు. అలాంటి కమల్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఐతే ఇప్పుడు యూనివర్సల్ స్టార్ ట్విట్టర్లో ఎంటరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా అక్కౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా ఇళయరాజా డైరక్షన్ లో కంపోజ్ చేసిన నేషనల్ యాంథెమ్ ను ట్వీట్ చేశారు. అక్కౌంట్ తెరిచిన 18 గంటల్లోపే కమల్ ను 39వేలమంది ఫాలో అయిపోయారు. 

          కమల్ హసన్ డాటర్ శృతిహాసన్ సహా అంతా ఆయనకు వెల్ కమ్ చెప్పేసారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న కమల్ ఇకనుంచి ట్విట్టర్ ద్వారా కూడా అభిమానులకు టచ్‌లో ఉంటారని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. కమల్ హసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ ట్విట్టర్లో యమ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ రాణిగా తనని తాను చెప్పుకుంటుంది కూడా. ఇప్పుడు తండ్రి ట్విట్టర్ అక్కౌంట్ ఓపెన్ చేయడంలో ఆమె పాత్ర ఖచ్చితంగా ఉండే ఉంటుందని అంటున్నారు. పాపనాశనం చీకటి రాజ్యం సినిమాలతో గత ఏడాది సందడి చేసిన కమల్ హసన్ చేస్తున్న కొత్త సినిమాలు ఆయన ఆలోచనలు అన్నీ ఇకపై ట్విట్టర్లో దర్శనమివ్వబోతున్నాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Kamal Hasan movies are care of address for Variety movies. Kamal hasan has fans in whole India. He has good following in facebook, and twitter.