మేమంతా బ్రదర్స్

23 Jan 2016


            జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో సిత్రాలు మామాలుగా లేవు..ఒకప్పుడు సీమాంధ్రులను తన్ని తరిమేస్తామనే రేంజ్ లో మాట్లాడినవారంతా ఓట్ల కోసం ఇప్పుడు వాటేసుకుంటున్నారు..ఈ రేసులో అందరికంటే ముందుంది టీఆర్ఎస్ పార్టీ..అంతా తానై తెగ తిరిగేస్తున్న మంత్రి కేటీఆర్ మాటలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది..అయ్య కేసీఆర్ లా..మాస్ లాంగ్వేజ్ మాట్లాడితే..సిఎం కుర్చీకి తొందరగా అటాచ్ అవుతారని ఫీలవుతున్నాడో ఏమో కానీ..ఆయన్లానే తన్నుడు గుద్దుడు అంటూ లెక్చరిస్తున్నాడు.. ఎలక్షన్ కాన్వాస్ లో భాగంగా సిటీలో ఏ ఏరియాకి వెళ్లినా తెలంగాణ వస్తే..సీమాంధ్రులపై దాడులు జరుగుతాయని అన్నారని..అలాంటి ఘటన ఒక్కటైనా  ఉందా అంటూ ప్రశ్నిస్తూ.. తెలంగాణ, సీమాంధ్రులంతా బ్రదర్స్ అంటూ సెంటిమెంట్ కొట్టాలని ట్రై చేశారు..ఐతే టిఆర్ఎస్ వెళ్లగక్కిన విద్వేషం ఇప్పుడు బైటికి కన్పించడం లేదు..కానీ సిటీలో ఇంకా ఏపీవాసులంటే ఏదో ఈర్ష్య, అసూయ,ద్వేషం వెళ్లగక్కే వాళ్లకు కొదవలేదు.. ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఇలా శాంతిమంత్రం జపిస్తున్నారని అంటున్నారు..దానికి ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రోళ్ల పార్టీలు అవసరమా అని ఆ పార్టీ నేత కవిత అంటుండమే..ఆంద్రోళ్ల పార్టీ వద్దు కానీ..ఓట్లు కావాలా అని చాలామంది సీమవాసులు ఈసడించుకుంటున్నారు..ఎంత చెప్పినా..సీమాంధ్రవాసుల్లో టీఆర్ఎస్ పై కనికరం ఇప్పుడప్పుడే కన్పించదన్నది సత్యం.

GHMC elections are the flat form for different different dramas. Once upon a time TRS leaders were told Seemandra people are not Telangana citizens, but now they are saying we both are brothers.