ప్రియురాలికి విశాల్ ఏమని మాట ఇచ్చాడు

14 Jan 2016         తెలుగు కుర్రోడు విశాల్ కు తమిళంలోనే మంచి ఫాలోయింగ్ ఉంది..అక్కడ నడిగర్ సంఘం ఎన్నికల్లో కూడా తన వర్గాన్ని గెలిపించుకుని సత్తా చాటాడు విశాల్.. ఆ సమయంలో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు..శరత్ కుమార్ కుమార్తె,హీరోయిన్ వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం నడుపుతున్నాడంటారు..అసలందుకే శరత్ కుమార్ కి విశాల్ అంటే వళ్లు మంట అనే గాసిప్సూ ఉన్నాయ్..నడిగర్ సంఘం ఎన్నికల తర్వాత విశాల్ కు తమిళనాట ఫాలోయింగ్ ఇంకాస్త పెరిగింది..వరలక్ష్మితో మనోడి లవ్ ఎఫైర్ ఎంతవరకూ వెళ్లిందంటే సొంత సినిమాను కూడా పక్కనబెట్టి ఫస్ట్ షో ఆమె సినిమానే చూసే రేంజ్ కు వెళ్లిపోయాడు

         మామూలుగా ఏ హీరో అయినా తాను నటించిన సినిమా ఫస్ట్ షో మిస్సవ్వడు.. అందులో ప్రొడ్యూసర్ కూడా తానే అయితే ఇక చెప్పక్కర్లేదు..ఐతే విశాల్ నటించిన కథాకళి రిలీజ్ ఇవాళే..తన లవర్ వరలక్ష్మి నటించిన తారైతప్పట్టై కూడా ఇవాళే విడుదలైంది..కథాకళి ప్రివ్యూ చూడకుండానే...విశాల్ తారైతప్పట్టై ఫస్ట్ షో చూసేశాడట..ఎందుకంటే..ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నప్పుడే వరలక్ష్మికి ప్రివ్యూ చూసి ఒపీనియన్ చెప్తానని ప్రామిస్ చేశాట్ట..ఆ మాట నిలబెట్టుకునేందుకే ఇలా చేశాడని విశాల్ ఫ్రెండ్ సర్కిల్ టాక్

Telugu Man Vishal has more following in Tamilnadu. Today Vishal movie Kadha Kali is released, but Vishal did not attend for first show of this movie. He attended his lover Vara Lakshmi movie first show.