అక్షరాలా ఆదిశేషుడు నోట్ల కట్టలపామే

20 Jan 2016


            
        విజయవాడ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పేరుకు తగ్గట్లు కట్టలపామేనని బైటపడింది..ఆదిశేషు ఇంట్లో ఏంటీ కరప్షన్ బ్యూరో అధికారులు తనిఖీ చేయగా..నోరెళ్లబెట్టే రేంజ్ లో ఆస్తులు బైటపడ్డాయ్.. దాదాపు 100కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆదిశేషు కూడబెట్టినట్లు తెలిసింది..తవ్వుకుంటూ పోతే..బైటపడే పాపాల పుట్టల్లా కట్టలకు కట్టలు డబ్బులు బైటపడుతుంటే..ఏసీబీ అధికారులు లెక్కపెట్టలేక ఆయాస  పడిపోయారు.. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పొరేషన్ లో పని చేస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించి ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదుల నేపధ్యంలో ఆదిశేషుతోపాటు అతడి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు రెయిడింగ్ చేసి..సోదాలు చేపట్టారు.ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెడుతున్నారంటే..మరి మిగిలిన ఉద్యోగుల సంగతి కూడా చూడాల్సి ఉంటుంది..కోట్లకి కోట్లు సాధారణ మార్గంలో సంపాదించారంటే నమ్మే వారెవరూ లేరు..నిజంగా డబ్బు సంపాదించడం అంత సులభమైతే..అదెలానే మిగిలినవారికీ చెప్తే..నేర్చుకుంటారు కదా

Vijayawada excise commissioner Adhi Seshu was caught by ACB today morning. With confidential information ACB done rides on commissioner and his relatives houses and find nearly 100cr property.