శభాష్ బాలయ్యా

23 Jan 2016


           నటుడు బాలకృష్ణ ఎన్నడూ లేనంతగా మీడియాలో కన్పిస్తున్నారు..అడిగినవాళ్లదే లేటన్నట్లుగా ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు..ఇన్నాళ్లూ తనపై సోషల్ మీడియాలోనూ..బైటా విన్పించే సైటైర్ల గురించి ఆయన స్పందించిన తీరు చూస్తే శభాష్ అనకమానరు..సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య స్వప్న అనే ఏంకర్ '' బాలకృష్ణ,రజనీకాంత్ సినిమాలు లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు..మీపై వచ్చే సెటైర్లు..అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనే సినిమా పేరు కూడా చెప్పారు..పల్నాటి బ్రహ్మనాయుడు లో నేను తొడగొడితే ట్రైన్ కూడా వెనక్కి వెళ్తుంది..ఏదో  అప్పుడేదో డైరక్టర్ అడగడం ఏంటో..
           నేను ఒప్పుకోవడం ఏంటో అంటూ పెద్దగా నవ్వేసాడు బాలయ్య..నాకు అప్పుడప్పుడూ అన్పిస్తుంది తొడగొడితే రైలు వెనక్కి వెళ్లడం ఏంటంటూ స్పందించాడు..అలా తన సినిమాపై తానే జోకులేయడం బాలయ్య మనసుకు నిదర్శనంగా ఫ్యాన్స్ చెప్తున్నారు..ఇంతవరకూ బాలకృష్ణపై  ఉన్న ప్రచారం..ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆగిపోతుందని టాక్.. అలానే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా తనకెవరి సలహాలు అక్కర్లేదని అతని కెరీర్ ఎలా ప్లాన్ చేయాలో తనకి తెలుసని కుండబద్దలు కొట్టాడు బాలయ్య.

Present Balakrishna appearing in media very frequently. Yesterday he gave interview to Sakshi TV. He commented about Moshagna entry.