వెంకీ స్పీడ్

23 Jan 2016             లేటు వయసులో మళ్లీ లేటెస్ట్ గా విజృంభించబోతున్నాడు వెంకీ.. ఒకప్పుడు విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న వెంకటేష్ ఆ తర్వాత సడన్ గా రేసులో వెనకబడిపోయాడు.. ఎందుకో తెలీదు..హిట్లు కొడుతూనే ఫ్లాపులుఊబిలో కూరుకుపోయాడు..అందరూ లైమ్ లైట్ లో ఉన్నా..ఎవరిమీదా పడనంత వయోభారం వెంకీపై పడింది..బాలయ్య,నాగార్జున, ఆఖరికి చిరంజీవి కూడా యంగ్ లుక్ తో కాకపోయినా..మిడిలేజ్ లుక్ మెయిన్ టైన్ చేస్తుంటే..వెంకీ మాత్రం ఓల్డేజ్ దగ్గరపడ్డోడిలా తయారయ్యాడు..ఐతే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టుతో ఫ్రెష్  ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా..షాడో,మసాలా దెబ్బకి మళ్లీ డౌనయ్యాడు..ఇప్పుడు యంగ్ డైరక్టర్ మారుతితో బాబు బంగారం చేస్తున్న వెంకీ..ఈ లోపే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేస్తున్నాడు..దృశ్యం సినిమాతో సక్సెస్ ట్రాక్ తెలుసుకున్న వెంకీ మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాట్ట..సినిమాకి ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి..
          ఓల్డేజ్ కి దగ్గరపడ్డ హీరోలంతా యంగ్ డైరక్టర్లతో సినిమాలు చేయడం ఎన్టీఆర్ఎఎన్నార్ తరం నుంచీ ఉన్నదే..కొత్తవారైతే..వారి యూత్ ఆలోచనలతో కథానాయకులకూ యంగ్ లుక్ తెస్తారు..ఇది కృష్ణ,చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జునకు బాగా వర్కౌట్ అయింది..కాకపోతే వెంకటేష్ ఈ లైన్ ను లేట్ గా పట్టుకున్నాడంతే..

Present Venkatesh is going in high speed with hits. But in his recent movie Gopala Gopala he looks very aged, he is trying to appear in new look.