వారంతా కుక్కలట

23 Jan 2016


             సమయం సందర్భం లేకుండా మాట్లాడటం లో బిజెపినేతలకు మించిన వారులేరని గతంలోనే చెప్పాం. ఇప్పుడు మరోసారి అది రుజువైందిఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటే. ఆ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా. అతను దళితుడా. బీసీనా అఁటూ ఈకలు పీకుతున్న లీడర్ల లిస్టులోకి సుబ్రహ్మణ్యస్వామి కూడా చేరిపోయాడుఆత్మహత్యకు నిరసనగా దీక్షలు చేస్తున్నవారిని. వారికి మద్దతు పలుకుతున్నవారిని ఆయన కుక్కలతో పోల్చారు. పైగా హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ డ్రామాని కమ్యూనిస్టులు ఆడిస్తున్నారని అనడం దీనికి పరాకాష్ట. ఇక్కడ ఆయన ఓ విషయం కన్వీనెంట్ గా మర్చిపోయినా. ఆయన డైలాగ్స్ మోడీకే తగలాలి. నిన్ననే వారణాసిలో పుత్రశోకం అనుభవిస్తున్న తల్లి భాధ నాకు అర్ధమవుతుందంటూ మోడీ ప్రకటించారు. మరిప్పుడు ఆయన కూడా శునకాల జాబితాలో చేరారని సుబ్రహ్మణ్యస్వామి భావిస్తున్నారా

        ఇదే ఓసీ విద్యార్ధి చనిపోతే ఒకటి. బీసీ విద్యార్ధి చనిపోతే. ఒకలా. ఎస్సీ విద్యార్ధి చనిపోతే ఇంకోలా స్పందించాలని సమాజం భావిస్తుందా. లేక బిజెపి నేతలు భావిస్తున్నారా. ఈ ప్రశ్న కు బదులిచ్చేవాళ్లెవరు. ఈరోజు యూనివర్సిటీలో రోహిత్ తల్లి ఇదే ప్రశ్న అడిగింది. అసలు తమకు ఈ అంశంలో సంబంధం లేదన్నప్పుడు బిజెపి నేతలెందుకు ఇంతలా స్పందిస్తున్నారు. అన్నీ మూసుకు కూర్చోక అని ఓ  స్టూడెంట్ ప్రశ్నించాడు. ఇది అర్ధమైందో లేదో మరి మన  నేతలకు.

HCU student Rohti case taking different turns. Leaders are talking about it differently, Today BJP leader commented about HCU incident, all the politicians who commented about it are dogs.