బీఫ్ పాలిటిక్స్

27 Jan 2016


              సిటీలో దున్నపోతు మాంసంపై చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ దాద్రిలో మొదలైన ఈ అంశం దేశం మొత్తం చుట్టొచ్చింది బీఫ్ కి ఆవుకు తేడా ఉంది. దున్నపోతుమాంసం, గొడ్డు మాంసం. ఎగుమతిలో మన దేశమే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు అలాంటిది ఇక్కడ గోవధపై నిషేధం చాలా రాష్ట్రాల్లో ఉన్న అమలు కావడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదో అంశం చేస్తారు పొలిటీషియన్స్. ఇప్పుడు ఆ ట్రెండ్ హైదరాబాద్ సిటీకి పాకింది. దీనికి ఆద్యుడు అసదుద్దీన్ ఒవైసీ సిటీలో బిజెపిని గెలిపిస్తే బీఫ్ పై బ్యాన్ ఉంటుందిట. ఈయనగారి లెక్కలు అలా ఉన్నాయ్ అంటే ముస్లింలంతా బీఫ్ ఎగబడి తింటారని ఆయన ఉద్దేశం ఏమోగానీ బీఫ్ తినాలంటే తమకే ఓటేయాలని పిలుపు ఇచ్చారు. దీంతో కరెంట్ తీగ రేవంత్ రెడ్డికి ఎక్కడో మండినట్లైంది. టాఠ్ అస్సలు ఆయనెవరు ఆ మాట చెప్పడానికి మేం ఆవును పూజిస్తాం అలాంటి గోమాతను వధిస్తే చూస్తూ ఊరుకోం అంటూ రెచ్చిపోయారు.

           అసలు ఏది తినాలో తినకూడదో వ్యక్తిగతం హైదరాబాద్ లో మాంసంపేరుతో జనం తినేవాటిలో ఏం కలుపుతున్నారో ఎవరికి తెలుసు. ఇందులోకి హిందూ దేవతలను పురాణాలను తీసుకురావడం వాటిని అవమానించినట్లే. ఎఁదుకంటే ఒకరు ఒక మాట అంటారు దాన్ని పట్టుకుని ఇంకొకరు వ్యంగ్యంగా మాట్లాడటం చివరికి నోరు విప్పని దేవతలపై వ్యాఖ్యానాలు అవసరమా బహుశా వీరిద్దరి వ్యాఖ్యలపై ఎవరో ఒకరు కోర్టులకెళ్తారేమో చూడాలి మరి.
Beef Politics are hot topic in Hyderabad city. Different parties are talking about different words about it.