టిఆర్ఎస్ కు సిటీలో సీన్ లేదా?

14 Jan 2016


             ఔనట..!ఈ మాట మేం కాదు..బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు..హైదరాబాద్ లో అధికారపార్టీకి బలమేలేదని తేల్చేశారాయన.. టిఆర్ఎస్ కు నగరంలో పునాదులు లేవని చెప్పిన కిషన్ రెడ్డి..అసలు దేశంలోనే బిజెపిదే కీలక పాత్ర అని ప్రకటించేశారు. అందుకే తమకి ఓటేయాలంటూ పనిలో పనిగా సెలవిచ్చారు..అధికారపార్టీకి బలం లేదని తేల్చిన కిషన్ రెడ్డి తమ బలమెంతో కూడా చెప్పడమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఎందుకంటే..సంప్రదాయబద్ద ఓట్లు తప్ప..ఇప్పుడు బిజెపివైపు ఎవరూ చూడటం లేదని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది..నిజంగా బిజెపికి బలమే ఉన్నట్లైతే..గత ఎన్నికల్లో ఎందుకు మంచి ఫలితాలు సాధించలేదో తెలియాల్సి ఉంది..మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే తిరుగుబాటునే సర్దుకోలేని పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రేంజ్ వార్డులు గెలుచుకుంటుందో చూడాలి..మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ టిడిపికి కూడా భారీగా కార్యకర్తలున్నారని చెప్పారు..తమ జోడీ సూపర్ హిట్ అవుతుందంటున్న కిషన్ రెడ్డి..మరి టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు టిఆర్ఎస్ వైపు జంప్ కొడుతున్నారో చెప్పాలంటున్నారు. మరోవైపు ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేసి..గెలిపించినా తర్వాత టిఆర్ఎస్ లో చేరతారంటూ గుసగుసలు విన్పిస్తున్నాయ్..ఈ ప్రచారం టిడిపి-బిజెపి కూటమికి పెద్ద దెబ్బగా మారుతోందనే చెప్పాలి..

All Party leaders trying to win in GHMC elections. BJP leader Kishan Reddy told that TRS has no capacity in Hyderabad city. we will win in this elections, in all over India BJP has more popularity.