గెలిస్తేనే పరువు దక్కేది-చంద్రబాబు

14 Jan 2016


               ఏపి సిఎం,టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పని అంతా కార్యకర్తలకు, నేతలకు పంచేసి తాను మాత్రం ఫలితం అందుకోవాలని అనుకుంటున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయ్..టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పార్టీనేతలతో మాట్లాడుతూ సిటీలో గెలుపు చాలా అవసరమని నూరిపోసినట్లు సమాచారం..తనకో టార్గెట్ ఉందని..దానికోసం ఎంత కష్టమైనా పడాలని చెప్పారట..పండగ ముగియగానే..ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కేడర్ కు ఆదేశాలిచ్చేసారట చంద్రబాబుగారు..ఐతే తాను మాత్రం పెద్దగా ప్రచారానికి రాననన్నట్లుగా చెప్పడంతో వారంతా ఉస్సూరన్నారని టాక్..ఎందుకంటే..సిటీలో ఎన్నికలు జరుగుతుంటే పార్టీ  ప్రెసిడెంట్ సిటీలోనే ఉంటూ..కాన్వాసింగ్ కు రాకపోతే ఎలా అని కార్యకర్తలు మదనపడుతున్నారు..ఐతే ఈ చిక్కు నుంచి కూడా చంద్రబాబు ఈజీగానే గట్టెక్కేశారు..ఎందుకంటే ఈ నెల 19 నుంచి 24 వరకూ తన టీమ్ తో దావోస్ టూర్ కు బయల్దేరుతున్నాడాయన.. దీనికోసం కోటిరూపాయల ఖర్చులు కూడా రెడీ ఐపోయాయ్.. దీంతో కీలకంగా పార్టీలు భావిస్తున్న పోరులో టిడిపి కేడర్ స్థానిక నేతల ప్రచారంతోనే సరిపెట్టుకోవాల్సిన స్థితి కన్పిస్తోంది..సిటీలో గెలుపు చారిత్రక అవసరం అని చెప్తోన్న చంద్రబాబు టార్గెట్ వేరే ఉందని చెప్తున్నారు..కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపిస్తే తన వారసుడు లోకేష్ కు సిటీలో  పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని గాసిప్స్ గుప్పుమంటున్నాయ్.. ఐతే మరికొంత మాత్రం ఎటూ గెలిచే అవకాశం లేదు కాబట్టే..పైకి ఇలా గంభీరమైన ప్రకటనలిస్తూ..ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు

CM Chandra Babu Naidu is busy in GHMC elections. He is trying to win in GHMC elections. It is must to win in this elections to protect TDP in Telangana.