దేశంకన్నా తెలుగుదేశమే మిన్న

22 Jan 2016


    ఏపీ సిఎం చంద్రబాబునాయుడు స్వరాష్ట్ర భక్తి ఒక్కోసారి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయ్.ఓవైపు విభజన కారణంగా రాష్ట్రం విపరీతమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయంటూ సందు దొరికినప్పుడల్లా ఏకరువు పెడుతుంటారాయన..ఆయన బాధలో అర్ధం ఉంది కూడా..ఐతే దేశం దాటినప్పుడు తమ గొప్పదనం చాటుకునే ప్రయత్నంలో రాష్ట్రానికి మేలు చేయబోయి కీడు చేస్తున్నారంటారు..

ఇప్పుడు దావోస్ లోని సిఐఐ ఇన్వెస్టర్ల మీట్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అలానే ఉన్నాయ్..ఏపీ భీకరమైన స్పీడ్ తో డెవలప్ అవుతుందని..వృధ్ది రేటు ప్రపంచానిది 2.5 అయితే..దేశానిది 7.5గా చెప్పారాయన..ఐతే ఏపీ రాష్ట్రం మాత్రం అంతకన్నా ఎక్కువ శాతం వృద్ది రేటు ఉందని చెప్పారు..ఐతే ఎక్కడిక్కడ ఇలా చెప్తుంటే అంత డెవలప్ అయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతి ఏమో కానీ..అసలు రాయితీలు కూడా ఎందుకివ్వాలని కేంద్రం మెలిక పెడుతుందని గ్రహించాలని పెద్దలు చెప్తుంటారు.. 

ఆర్ధికఇబ్బందులు ఉన్నా టాప్ స్పీడ్ తో ముందుకెళ్తున్నామని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే అయిఉండొచ్చుకానీ..రాష్ట్రానికి తెస్తామన్న ప్రత్యేక హోదా..ప్యాకేజీ వీటన్నింటికి ఈ మాటలు గండికొడతాయని ఎందుకు గ్రహించరో అర్ధం కాదు.. ఆర్ధికలోటు పాతికవేల కోట్లని ఓవైపు చెప్తూనే..మరోవైపు ఈ స్థాయి అభివృధ్ధి ఎలా సాధ్యమో కూడా చెప్పగలగాలి.

Present CM Chandra is in Devos to promote Andhara Pradesh, and to attract investments to Andhra Pradesh. In this meeting  CM told that AP got more growth rate than India.