సమ్మర్ వార్ ఫిక్స్

27 Jan 2016


            సంక్రాంతి రేసులో ఫ్యామిలీ వార్ నడవగా ఫలితంపై ఎవరికివారే విజయం సాధించినట్లు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో రెండు సినిమాలకు పెద్దగా బ్యాడ్ టాకైతే లేదు. ఐతే ఇప్పుడు ఎర్లీగా సమ్మర్ వార్ కూడా ఫ్యామిలీ వారనే ఫిక్సైపోయారు. ఐతే ఈసారి ఇది అల్లు, కొణిదెల కుటుంబసభ్యుల మధ్య పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ సరైనోడు సమ్మర్ లో రిలీజ్ కు డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. 

                  అత్తారింటికి దారేది తర్వాత పవన్ సినిమాలేదు, అల్లుఅర్జున్ వి రుద్రమదేవి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చాయ్. రెండూ పెద్దగా ఆడ్లేదు కానీ పేరు మాత్రం వచ్చింది బన్నీకి. అందుకే బోయపాటి డైరక్షన్ లో మాంచి కసిగా సరైనోడుగా వస్తున్నాడు. ఇప్పటికే బన్నీ పవన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటారు మధ్యలో పాచప్ అయినా అదేం  కుదిరినట్లు లేదు. ఇప్పుడు గబ్బర్ సింగ్ వర్సెస్ సరైనోడులో ఎవరు తగ్గుతారో చూడాలి. అలానే ప్రిన్స్ మహేష్ కూడా బ్రహ్మోత్సవంతో రేసులో ఎంటరైతే. ఇక సినిమా లవర్లకు పండగ అనే చెప్పాలి. ఐతే మళ్లీ అప్పుడు కూడా థియేటర్ల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడడం ఖాయంగా కన్పిస్తోంది.
For movie Sankrathi and summer is good festival. This Sankrathi is good for all released movies. But to the summer war must be in between Mega family and Allu family.