కష్టాలు చెప్పుకున్న సుధీర్ బాబు

25 Jan 2016


          హిట్లు లేకపోయినా మంచినటుడిగా పేరు తెచ్చుకున్నాడు మహేష్ చిన్నబావ సుధీర్ బాబు. చివరకు మహేష్ కూడా మంచి బ్రేక్ పడితే సూపర్ స్టారైపోతాడు మా బావ అంటూ భలేమంచి రోజు ఆడియో రిలీజ్ సందర్భంగా చెప్పాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్ తన కెరీర్ మొదటి సినిమా కష్టాలను చెప్పాడు అది వింటే నిజంగా షాక్ తినకతప్పదు. 
            కృష్ణఅల్లుడు మహేష్ బావ అంటే ఎవరైనా ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారనుకుంటారు కానీ రియల్ సీన్ అలా లేదు నా మొదటి సినిమా కోసం వాళ్ల దగ్గర వీళ్లదగ్గర డబ్బులు అడిగి తెచ్చి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం. ఆ తర్వాత టీ బాయ్ కు డబ్బులు లేక రెండు లక్షల రూపాయల వాచీ ఇచ్చేందుకు సిధ్దపడ్డాట్ట సుధీర్. అలానే హోటల్ లో బిల్ 250 రూపాయలు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయని చెప్పాడు సుధీర్. అలానే సినిమాలమీద ప్యాషన్ తో ఆర్నెల్లలోనే డ్యాన్స్, ఫైట్స్ నేర్చుకున్నానని చెప్పాడు సుధీర్ బాబు. ఆ ఫీట్లు  చూసి ఆడియెన్స్ కూడా స్పెల్ బౌండ్ అయ్యారు ఉన్నది ఉన్నట్లు చెప్పుకుని శభాష్ అన్పించుకున్నాడు సుధీర్ బాబు. నిజంగా అతనికి అన్నీ ఉన్నా ఇప్పుడు బంపర్ హిట్  ఒకటి కరువైంది.

SMS fame hero Super star Krishna son-in-law Sudheer Babu told about his film carrier and struggles faced by him. Yesterday in a TV channel interview he told about his carrier starting and work out for his films. Matters about his childhood.