బాహుబలి స్టుపిడ్..

25 Jan 2016


        బాహుబలి సినిమాను ఏ ఇండస్ట్రికి చెందినవారైనా ఓ గొప్ప సినిమాగానే చెప్పారు. లోపల ఏమున్నా బయటకు మాత్రం బాహుబలి తెలుగు సినిమా రేంజ్ ను పెంచిందంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఐతే వెటరన్ యాక్ట్రెస్ అప్పటి సత్యభామ జమునకు మాత్రం ఇదో స్టుపిడ్ సినిమాగా కన్పించిందట. అదే  అంశాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేశారు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ తప్ప కథేం లేదని, అందులో అంత గొప్పదనం ఏం లేదని చెప్పారామె. 

           ఆపాతమధురాల్లో గొప్ప చిత్రాల్లో నటించిన జమున వయోభారంతో సినిమాలకు దూరమయ్యారు. ఆమె అభిప్రాయం సినిమా ఇండస్ట్రీలో ఎవరినీ ప్రభావితం చేయదుకానీ. అపారఅనుభవం ఉన్న ఓ నటి ఇలాంటి కామెంట్ చేయడం ఆ సినిమా నిర్మాతలకు కాస్త ఇబ్బంది కలిగించేదే. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి ఇదో షాక్ అని చెప్పాల్సిందే. ఐతే హుందాతనంతో ఎవరి అభిప్రాయాలు వాళ్లవి అని చెప్పి తప్పించుకోవచ్చు కానీ. ఇలాంటి పరిస్థితి రేపు ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వస్తే పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. ఏ మోహన్ బాబో బాలకృష్ణో ఇలా మాట్లాడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండి ఉండేది.

Bahubali movie got biggest hit in Tollywood and Bollywood and all over India. All industries directors are appreciate Bahubali movie and its director Rajamouli. But our senior artiest Jamuna commented on it, it has no story only graphics.