అంగరంగ వైభవంగా స్టార్ స్క్రీన్ అవార్డుల ఫంక్షన్

25 Jan 2016స్టార్ స్క్రీన్ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగాయ్. దానికి ముందు బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన ఫెర్మామెన్స్ అద్దిరిపోయాయ్ బ్యూటీలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆలియా భట్ ఇరగదీస్తే మొత్తం ఈవెంట్  కి అట్రాక్షన్ గా రణ్ వీర్ సింగ్ నిలిచాడు. నాన్ స్టాప్ గా పావుగంటకి పైగా అతను చేసిన డాన్స్ మొత్తం ఆడియెన్స్ ను స్పెల్ బౌవండ్ చేసిందంటే ఆశ్చర్యం కాదు ఆన్ స్క్రీన్ లవర్ దీపికా పడుకునే చూస్తుండగా ఆఫ్ స్క్రీన్ కూడా రణ్ వీర్ సింగ్ రెచ్చిపోయాడు. కేక పుట్టించే డ్యాన్సులతో అలరించాడు సినిమాలో ఓపెనింగ్ లో హీరో ఎంట్రీలా వేలాడే కారుపై ఎంట్రీ ఇచ్చిన రణ్ వీర్ ఆ తర్వాత మారథాన్ డాన్సాడాడు. బాలీవుడ్ కా మేలా అన్న రీతిలో సాగిన ఈ ఈవెంట్ కి సెలబ్రెటీలు వందల సంఖ్యలో హాజరయ్యారు. పాత పాటలకు నృత్యం చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత యాక్షన్ హీరో అక్షయ్ కుమార్,సోనాక్షిసిన్హా మెరుపులు మెరిపించారు. ఐతే మెయిన్ షో మాత్రం రణ్ వీర్ సింగ్ దనే చెప్పాలి. తన ఫెర్మామెన్స్ ను డయాస్ లు మారుస్తూ చేస్తు మధ్య మధ్యలో సెలబ్రెటీల చేత కూడా స్టెప్పులు వేయించాడు. ప్రియురాలు దీపికాపడుకునే చూస్తుండగా రణ్ వీర్ డ్యాన్స్ చేస్తూ మధ్యలో అమితాబ్ కు పాదాబివందనం చేసాడు. రణ్ వీర్ సింగ్ డ్యాన్స్  చేస్తున్నంతసేపూ ఆడియెన్స్ సెల్ఫీలు వీడియోలు తీస్తూ బిజిబిజీగా కన్పించారు. మొత్తానికి స్క్రీన్ అవార్డ్స్ లో బెస్ట్ మేల్, బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ గా రణ్ వీర్, దీపికానే ఎన్నికవడం విశేషం.

Yesterday Star screen function was conducted. For this function all Bollywood stars were attended, and did spell bone performances. With their performances they entertained audians.