శ్రీకాంత్ కి మెంటలెక్కిస్తాడా..?

26 Jan 2016             యాభైఏళ్లకు దగ్గరపడ్డ హీరో శ్రీకాంత్ వంద సినిమాల్లో హీరోగా నటించిన రికార్డు తప్ప మనోడికి ఇప్పుడు సినిమాఛాన్సులు పెద్దగా లేవు. నాలుగేళ్ల క్రితం వరకూ కూడా సినిమా ఫ్లాప్ హిట్లతో సంబంధం లేకుండా ప్రతీ ఏటా నాలుగు సినిమాలు విడుదలయ్యేవి శ్రీకాంత్ వి. కానీ ఇప్పుడు చూస్తే అటు యువహీరోల విజృంభణ, తన సహచరహీరోల క్యారెక్టర్ వేషాలవైపు మళ్లడంతో శ్రీకాంత్ నాలుగురోడ్ల కూడలిలో నిల్చున్నట్లైంది.

            ఈ జంక్షన్ నుంచి ఎలా బయటపడాలో అనే మథనంలోనే శ్రీకాంత్ కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే కొన్ని ఊరు పేరు లేని సినిమాలు విడుదలవుతున్నాయ్. రీసెంట్ గా మెంటల్ పోలీస్ అనే ఓ సినిమా చేస్తున్నాడని ఇవాళే తెలిసింది. ఫస్ట్ లుక్ అంటూ విడుదల చేసిన ఫోటోలో మెళ్లో చెప్పులదండతో నానా కంగాళీగా కన్పిస్తున్నాడు. ఈ సినిమాతో జనానికి మెంటల్ ఎక్కిస్తాడో లేక తానే మెంటల్ షాక్ నుంచి బైటపడతాడో తెలీదు కానీ. ఇంకా హీరోగానే సాగాలన్న తపన మాత్రం అభినందనీయం.
Tollywood hero reached 100 movies. But he has no movies, before four years he was released 4 movies per year. Today he released his latest movie poster called Mental Police.