వాయ్యా..ఇవేం షాకులు

23 Jan 2016


         గ్రేటర్ ఎన్నికలు ఇంకో పదిరోజుల్లోకి వచ్చేశాయ్..ఈ టైమ్ లో టిడిపికి హైదరాబాద్ లో పెద్ద షాక్ తగిలింది..టీఆర్ఎస్ లోకి జంప్ కొడుతున్న నేతల సంఖ్య పెరుగుతూ పోతుంటే..ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు టి.కృష్ణయాదవ్ తన పదవి కి రాజీనామా చేయడం ఆ పార్టీలో తీవ్ర సంచలనం కలిగించింది.. మంత్రి తలసాని టిడిపిని వీడి టిఆర్ఎస్ లో జాయినవగా..ఆ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు కృష్ణయాదవ్ ను తెరపైకి తెచ్చారు..అప్పట్లో భలే చాణక్యం అని ఆయన్ని పొగిడారు కూడా.
                ఐతే ఇప్పుడిలా కీలక సమయంలో ఇలా హ్యాండివ్వడం చూస్తుంటే కృష్ణయాదవ్ పార్టీకి కూడా గుడ్ బై చెప్తారేమో అని డౌట్ వస్తోంది.. పైగా ఈ సందర్భంలో ఆయన చేసిన ఆరోపణలు కూడా సెన్సేషన్ కలిగిస్తున్నాయ్.. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో లక్షల చేతులు మారాయని ఆరోపించారు.. రెండ్రోజుల క్రితమే మాగంటి గోపీనాధ్, రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని తెలుగునాడు స్టూడెంట్ వింగ్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం గుర్తుండే ఉంటుంది..ఇప్పుడు కృష్ణయాదవ్ ఆరోపణలు కూడా ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయ్.

Just in 10 GHMC elections are ahead, So all leaders are trying attract voters. But TDP leader Chandra Babu is trying protect their leaders not to skip in to another party. Recently Thalasani Yadav jumped to TRS.