చంద్రబాబుకు షాక్

27 Jan 2016


                ఏపి సిఎం చంద్రబాబునాయుడుకు విజయవాడలో నిరసన తెలిపాడో యువకుడు. కాల్ మనీ అంటూ వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొన్నాళ్లుగా కేసులు ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే ముందుగా ఇది విజయవాడ నుంచే ప్రారంభమైంది. వడ్డీ వ్యాపారం ఈనాటిది కాదు ఐతే తీసుకున్న డబ్బుకు పదింతలు వసూలు చేయడం. ఇవ్వనివారిచేత బలవంతంగానో, తప్పనిసరిపరిస్థితుల్లోనే వ్యభిచారానికి పాల్పడేలా చేయడంతో ఇది బద్దలైంది. అందులో టిడిపి నేతలే ఎక్కువమంది ఉన్నారని అసెంబ్లీ లోపల బయటా గగ్గోలు పుట్టింది. ఏ హడావుడి అయినా కొన్నాళ్లే ఉంటుండగా, ఈ కాల్ మనీ కేసులు మాత్రం ఇంకా బైటపడుతూనే ఉన్నాయ్. 

          విజయవాడలో  చంద్రబాబు నాయుడు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షో కార్యక్రమం చివరిరోజున పాల్గొనగా అందులోనూ ఆయనకు కాల్ మనీ నిరసన సెగ తగిలింది. తాము ఈ కాలనాగుల బారిన పడి అల్లాడిపోతున్నామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చుట్టాల నుంచి మమ్మల్ని కాపాడంటండూ బాబు ఎదుటే ప్లకార్డలుు, నినాదాలు  చోటు చేసుకున్నాయ్. దీంతో చంద్రబాబు ఓ క్షణం బిత్తరపోయారు వెంటనే  తేరుకుని క్యాంప్ కార్యాలయానికి వచ్చి మీ బాధలు చెప్పుకోండని అన్నారు. సమసిపోయిందనుకున్న పార్టీ నేతల కాల్ మనీ యవ్వారం తనని నీడలా వెండాడుతుండటంతో దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలా అని టిడిపి అధినేత ప్రస్తుతం మదనపడుతున్నారుట.
Vijayawada call money case is created sensation all over India. It past three months before, but till now some of the cases are happening. Yesterday Chandra Babu faced shock about this call money.