ఎంపి దయాకర్ ఎన్నికపై పిటీషన్

20 Jan 2016



        నిన్నగాక మొన్న ఎంపిగా ఎన్నికయ్యారో లేదో..అప్పుడే టిఆర్ఎస్ ఎంపి పి.దయాకర్ పై ఆరోపణలు మొదలయ్యాయ్..  వరంగల్ ఎంపి స్థానానికి  జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరు దయాకర్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్  దాఖలు చేశారు. దయాకర్ ఎన్నికను రద్దు చేసి ఆ స్థానంలో తాను గెలిచినట్లు ప్రకటించాలని సర్వే కోరారు..తన పిటీషన్ లో ఎంపి దయాకర్ తో పాటు ఇతర అభ్యర్ధులు..ఈసీను కూడా ప్రతివాదులుగా చేర్చారాయన. 
           మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ వాదన ప్రకారం  నామినేషన్ దాఖలు చేసే నాటికి దయాకర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారట.. ఆ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్లలో దయాకర్, అతని భార్య సంతకాలు చేశారని అవే అందుకు ఆధారాలని చెప్పారాయన. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు ప్రభుత్వంతో కాంట్రాక్టు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని సర్వే పాయింట్.. నామినేషన్ పత్రాల్లోని ఆస్తుల కాలమ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద దాదాపు ఒకటిన్నరలక్షల అడ్వాన్స్ ఉందని చెప్తున్న సర్వే..దయాకర్ భార్య హౌస్ వైఫ్ అని పేర్కొన్నారని..ఆమె కూడా గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారని లా పాయింట్ లాగారు..ఐతే కొద్దిసేపు ఇదంతా నిజమే అనుకున్నా..కోర్టుల విచారణల పర్వం ముగిసేదెప్పుడు..ఈలోపు..2019 తరుముకు వస్తూనే ఉంటుంది..ఐతే సర్వే తపనను మాత్రం అభినందించాల్సిందేనంటున్నారు వరంగల్ జనం.

Congress Ex MP Serve Satyanarayan filed a case on TRS MP P.Dhayakar, he submitted fake documents on election. So remove him from MP and that position to me.