సీక్రెట్ సస్పెన్స్ కంటిన్యూస్

23 Jan 2016            ప్రధాని మోడీ నేతాజీ మృతికి సంబంధించిన ఫైళ్లను అందరికీ అందుబాటులోకి తెచ్చారు..ఐతే మిస్టరీ మాత్రం అలానే ఉంది. బోస్ కుటుంబసభ్యుల్లో సందేహాలు కూడా అలానే ఉన్నాయ్..విమాన ప్రమాదంలోనే మరణించారనడానికి ఇదే అంతిమ ఆధారం అనడానికి వీల్లేందంటున్నారు వారు.. దాదాపు వేయికి పైగా పేజీలున్న ఈ ఫైళ్లను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందంటున్నారు వారు..దీంతో ఈ అంశంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

            సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించి 70 ఏళ్లుగా సీక్రెట్ గా ఉంచిన ఫైళ్లను ప్రధాని మోడీ బైటపెట్టారు. ఈ పరిణామంతో నేతాజీ మృతికి సంబంధించిన వివాదాలు తొలిగే అవకాశముందని ఆశించారు..ఐతే కుటుంబసభ్యులు దస్త్రాలు బైటపెట్టడంపై ఆనందం వ్యక్తం చేసినా...అవే అంతిమ ఆధారాలు అని మాత్రం అనడం లేదు..సుభాష్ బోస్ కుటుంబానికి అధికారప్రతినిధిగా వ్యవహరిస్తున్న చంద్రకుమార్ బోస్ ఇదే అంశంపై స్పందిస్తూ.. ప్రభుత్వం విడుదల చేసిన ఫైళ్లు చాలా ఉన్నందున వాటిని అధ్యయనం చేయడానికి సమయం పడుతుందన్నారు..1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదం జరిగిందనడానికి ఆధారాలు కనబడుతున్నాయి కానీ..వాటితోనే పూర్తి నిర్ధారణకు రావడం కుదరదని చంద్రకుమార్ బోస్ చెప్తున్నారు..

           ప్రధాని మోడీ విడుదల చేసిన ఫైళ్లలో బోస్ ప్రమాదం జరిగిందని చెప్తున్న నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన పరిణామాలు ..వాటి పై ఆయాకాలంలోని అధికారుల మధ్య  జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ..సమాచార మార్పిడే కన్పించింది..అలానే విమాన ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ్నుంచి సింగపూర్ కు జపాన్ కు..తరలిన వస్తువులు..బంగారం..ఇతర సామాగ్రి గురించిన వివరణలు ఉన్నాయ్..ఐతే ఈ జ్యుయలెరీ కానీ..సామాన్లుతో పాటు విమాన ప్రమాదంలో లభించిన బూడిద ఫోటోలు కూడా ప్రదర్శితమయ్యాయ్..వాటితో పాటు..అప్పుడు స్వాధీనం చేసుకున్న నగదు..నగలు..వాటిని పరిశీలిస్తున్న కమిటీ సభ్యులు ఫోటోలు ఈ ఫైళ్లలో పొందుపరిచారు.. అప్పటి అధికారులు ప్రమాదం జరిగిందని చెప్తున్న సమయానికి ఆ తర్వాతికాలంలో నగల బరువులో తేడాలు గమనించారు..ఎస్ఏ అయ్యర్, ముంగారామమూర్తి వద్దనే వీటిల్లో తేడాలు వచ్చాయనే ఆరోపణలు ఉన్నా వాటిపై  ఎక్కడా పెద్దగా ఎంక్వైరీలు జరిగినట్లు కన్పించడం లేదు..ఐతే లెక్కల్లో తేడా..కాలక్రమంలో లోహాల క్షయంతో కానీ...వివిధ రకాల తూనికల యంత్రాలను వాడటం వల్ల కానీ మార్పు వచ్చి ఉండవచ్చనే నిర్ధారణకు  వచ్చారని విడుదలైన ఫైళ్లోలని సమాచారం తెలుపుతోంది..

అలానే రింకో ఆలయంలో భద్రపరిచిన చితాభస్మం వెనక్కు తీసుకొచ్చే అంశంపై కూడా బారత ప్రభుత్వానికి..జపాన్ ఆలయ పెద్దలకు..నడిచిన లేఖలు కూడా ప్రధాని విడుదల చేసిన ఫైళ్లలో ఉన్నాయ్.బోస్ కుటుంబసభ్యులు కానీ దేశంలోని బోస్ అభిమానులు..ఫార్వార్డ్ బ్లాక్ మెంబర్లు..బోస్ మరణాన్ని అంగీకరించేందుకు సిద్దంగా లేరని ఆ లేఖల ద్వారా స్పష్టమైంది..ప్రదాని మోడీ విడుదల చేసిన సీక్రెట్ పైళ్లలో అలా అందరికీ తెలిసిన సమాచారమే బైటికి వచ్చింది కానీ..సంచలనాత్మక కథనాలేవీ బైటికి రాలేదు..

           నేతాజీ మృతి అంశంపై రెండు కమిషన్లు 1945 విమాన ప్రమాదంలోనే ఆయన చనిపోయారని నిర్ధారించగా..ఆ తర్వాత మూడో విచారణ ఎంకే ముఖర్జీ ఆధ్వర్యంలో చేసిన మూడో విచారణ మాత్రం బోస్ ఆ తర్వాత కూడా జీవించి ఉన్నారని చెప్పింది..దీంతో వివాదం పెద్దదైంది..కుటుంబసభ్యులు కూడా తమ అనుమానాలు వ్యక్తం చేయడంతో..ఈ మిస్టరీ అలా కొనసాగుతూ వచ్చింది..ప్రస్తుత పరిణామంతో నేతాజీ కుటుంబసభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నేతాజీ మరణం అంశానికి సంబంధించి నిజాలను తొక్కి పెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ అభిప్రాయపడ్డారు..గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ముఖ్యమైన పైళ్లు నాశనం చేశాయని..దానికి సంబందించి తమ దగ్గర ఆదారాలు కూడా ఉన్నాయంటున్నారాయన.. అలానే రష్యా,జర్మనీ, యూకే, అమెరికాలో ఉన్న ఫైళ్లను కూడా బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని బోస్ కుటుంబం ఇప్పుడు తాజాగా డిమాండ్ చేస్తోంది..ఐతే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు..వాస్తవానికి తాము కూడా బోస్ ఫైళ్లను డీ క్లాసిపై చేయడానికి వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ చెప్పారు..

 ఈ వాదనల సంగతి ఎలా ఉన్నా నేషనల్ ఆర్కైవ్స్ ఇండియా ప్రతి నెలా  నేతాజీకి సంబంధించి పాతికఫైళ్లను డిజిటల్ రూపంలో విడుదల చేయబోతోంది..

Today is Subash Chandra Boss bithday, and this day is celebrates as youth day. Today PM Naredramodi released secret files of Nethaji life.