నీ పెళ్లికూతురి కోసం నా కార్డు

22 Jan 2016


బాహుబలి ప్రభాస్ కు పెళ్లి ఈ ఏడాదే చేస్తామంటూ కృష్ణంరాజు చెప్పిన బ్యాక్ గ్రౌండ్లో అతనికి పెళ్లికూతురు వెతికే శ్రమ తగ్గిస్తున్నారంతా.. ఈ రేస్ లో హీరో రానా ముందున్నాడు..ప్రభాస్ కోసం బ్రైడ్ వాంటెడ్ తరహాలో ఓ కార్డు కూడా ప్రింట్ చేసి ట్వీట్ చేశాడు..అది తమాషాగా చేశాడో..సీరియస్ గానో తెలీదు కానీ..వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కు అద్దం పడుతోందీ కార్డ్.. బాహుబలికి పెళ్లికూతురు కావాలి..ఆమెకి ఉండాల్సిన లక్షణాలంటూ.. కొన్ని ప్రత్యేకతలను కూడా అందులో మెన్షన్ చేశాడు..ముఫ్పై ఆరేళ్ల మల్లయోధుడు..వంటింటి పనుల్లో సాయం చేసేవాడు..కొండలు గుట్టలు ఎక్కగలిగేవాడు..ఎవరికైనా మేకప్ వేయగలిగిన వాడంటూ ...ఇలా సాగింది ఆ వర్ణన..కార్డు పూర్తిగా చూస్తే సరదాగానే ట్వీటేసినట్లుంది..గతంలో బాహుబలి విడుదలైన తర్వాత వీరిద్దరికీ కోల్డ్ వార్ నడిచిందని..హీరో ప్రభాస్ కంటే విలన్ గా కన్పించిన రానాకే ఎక్కువ పాపులారిటీ వచ్చిందని..ప్రమోషన్ విషయంలోనూ ప్రభాస్ వెనకబడిపోయాడని టాక్ నడిచింది..ఐతే ప్రస్తుతం ఈ ట్వీట్ తో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కన్పిస్తోంది.
After Baahubali hit Prabash get very popularity, and how hot topic is about Prabash marriage. Krishnam Raju told we will do marriage this year.