వర్మ ఊరుకుంటాడా..?

26 Jan 2016


         రాజమౌళికి పద్మశ్రీ ప్రకటించడంపై కాదు కానీ మొత్తం అవార్డులపైనే మనోడు కామెంట్ చేస్తాడని అనుకుంటూనే ఉన్నారు. కానీ వెరైటీగా రాజమౌళిని మాత్రమే టార్గెట్ చేశాడు ఆర్జీవీ. ఎప్పటికప్పుడు కామెంట్లు,ట్వీట్లు తప్ప బయట మాట్లాడటంలేదు రామ్ గోపాల్ వర్మ. ఊ అంటే టాలీవుడ్ ఛానల్లో రామూఇజం అంటూ ఓ అరగంట ప్రోగ్రామ్ తో తమ వాణి విన్పించే వర్మ ఇలాంటి కామెంట్లు మాత్రం ట్విట్టర్లోనే చేస్తాడు.

        అసలు సంబంధం లేకుండా మాట్లాడడంలో తనకి సాటి లేరనిపించుకున్నాడు ఈ ట్వీట్ తో రాజమౌళికి పద్మశ్రీ వచ్చింది కానీ నాకు మాత్రం పద్మ కూడా దక్కలేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగానే పేలింది. సెటైర్ వేసాడో తన ఆవేదన చెప్పుకున్నాడో కానీ. ఇప్పుడింతకీ ఈ పద్మ ఎవరో  ఏంటో అనే డిస్కషన్ కూడా మొదలైంది. ఆయన ఎక్స్ లవర్ అని కొంతమంది. ఏదో పంచ్ కోసం అలా ప్రాకులాడాడని కొంతమంది చర్చించుకుంటున్నారు.లేదంటే సదరు పద్మ ఎవరో రాజమౌళి, వర్మకు మాత్రమే తెలిసుండాలని కూాడ డీప్ గా మాట్లాడేసుకుంటున్నారు. కానీ నిజంగా అంత ఉందంటారా.
Tollywood popular director Rajamouli got Padhma Sri award. On this award Ramgopal Varma commented, that Rajamouli got award, but i was not.