గురుశిష్యుల పరస్పర డబ్బా

20 Jan 2016


      ఎవడి డప్పు వాడే కొట్టుకుంటే ఏం బావుంటుంది..నీది నేను..నాది నువ్వూ అన్నట్లుగా ఈ మధ్య రాఘవేంద్రరావ్,రాజమౌళి తెగ బాదేసుకుంటున్నారని టాక్ విన్పిస్తోంది..బాహుబలి సినిమాలో రాఘవేంద్రరావ్ పెట్టుబడులు ఉన్నాయంటారు..నిజాల సంగతెలా ఉన్నా..సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో అందుకే ప్రభాస్,రాజమౌళి రావడం..అసలు పని పక్కనబెట్టి..బాహుబలిని రాఘవేంద్రరావ్ మోసేయడం అందరూ గమనించారు..ఐతే సినిమా రిలీజైంది..హిట్టైంది..ఈ పరస్పర డబ్బాలనుంచి ఇంకా తెలుగు ప్రేక్షకులకు విముక్తి దొరకడం లేదు..తెలుగు సినిమా జనం ట్యాగ్ లైన్లు..బిరుదులంటే తెగ తాపత్రయపడతారు..అందులో భాగంగానే సుప్రీమ్ హీరో..మెగాస్టార్, పవర్ స్టార్..మెగా పవర్ స్టార్, నవ సామ్రాట్, నవయువసామ్రాట్, దర్శకరత్న, దర్శకేంద్రుడు..నటరత్న,యువరత్న ఇలా చెప్పుకుంటే పోతే చేంతాడంతవుద్ది లిస్టు..అక్కడికేదో ఇవన్నీ నిజంగానే ఏవో సంస్థలు మెమెంటోలు ఇచ్చి సత్కరించినట్లు భుజకీర్తులతో మురిసిపోతుంటారు మనోళ్లు..ఇప్పుడు ఆ పిచ్చ..రాఘవేంద్రరావ్ తన శిష్యుడు రాజమౌళికి కూడా అంటగడుతున్నారు.. దర్శకేంద్రుడుగా తన నెక్స్ట్ జనరేషన్ లో రాజమౌళికి సరిపోతుందంటూ కితాబిచ్చారట..గత దర్శకుల్లో ఈ మాత్రం భుజకీర్తులు సంపాదించుకోవడానికి అర్హతలు ఉన్నాయ్ కాబట్టి..ఎవరూ అభ్యంతరపెట్టరు..కానీ పట్టుమని పాతిక సినిమాలు కూడా తీయని ప్రతీ డెైరక్టరూ హిట్టే పరమావధిగా సాగిపోతుంటే..ఇలా బిరుదులు ఎవరు పట్టించుకుంటున్నారు..ఆ మాటకి వస్తే కళకు పరమార్ధం ఉందో లేదో ఇలా బిరుదులు పెట్టుకునేవాళ్లు చెప్పాలి..హే..ఏంటి సోది..నా నిర్మాత ముఖ్యం..ఆయన సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఏదైనా తీస్తా అని డైరక్టర్ తేజలాగైనా చెప్పాలి..అదేం లేకుండా..ఏదో మన సినిమాలతో దేశాన్ని ఉద్దరిస్తున్నట్లు ఫోజులిచ్చేవాళ్లని చూస్తే భయం వేస్తుంటుంది..ఇదేదో అక్కసుతో చెప్పడం లేదు..ఎవరైతే  ఇప్పుడు హిట్ డైరక్టర్లుగా చెప్పబడుతున్నారో..వారి సినిమాల్లో విలన్లు వాళ్లు చేసే పనులు..వేషాలు చూడండి..రోడ్డుమీదే రేప్ చేస్తాడొకడు..ఇంకొకడేమో వదినపై అత్యాచారం చేస్తాట్ట..ఇంకొకడేమో ఆడపిల్లలను వ్యభిచారులతో సమానంగా సంభోదిస్తూ..పిలుస్తుంటాడు..పైగా కాలం మారిందనే స్టాక్ డైలాగ్ ఒకటి..ఇంత నీచమైన పనులు చేసి..చివరకు ఓ హీరోధాత్తుడు వచ్చి వాళ్లను రక్షించాలి..ఇదే హీరోయిజం..ఇదే కథ..గత దర్శకరత్నలు..సవ్యసాచులు కూడా ఇలానే సినిమాలు తీశారా..?ఆలోచిస్తే...మా వ్యధ అర్ధమవుద్ది..బూతుపాటలు..ద్వంద్వార్ధాలు కూడా కాకుండా డైరక్ట్ బూతు మీనింగ్..ఏనాడూ కాలేజ్ కి సక్రమంగా వెళ్లని వాళ్లంతా డైరక్టర్లై.. కాలేజీ వాతావరణాన్ని ఓ సర్కస్ లా చూపించడం ఇదేనా...వీళ్లు వాళ్ల గురువులనుంచి..?

        Indian popular director Rajamouli is student of director Raghavendra Rao. In an private TV channel program they both were met and praising with each other.