పొలిటికల్ పద్మాలు

25 Jan 2016


            కేంద్రం ప్రకటించిన భారీ జాబితా చూస్తే పద్మ పురస్కారాలకు ఈసారి బాగానే పొలిటికల్ రంగు అంటినట్లు కన్పిస్తోంది..బిజెపి భావజాలం..లేదంటే ఆర్ఎస్ఎస్ కు సన్నిహితంగా మెలిగే ప్రముఖులకే పెద్ద పీట వేసారని విమర్శలు విన్పిస్తున్నాయ్..సినిమారంగంలో అనుపమ్ ఖేర్,రజనీకాంత్, ఉదిత్ నారాయణ..వ్యాపారరంగంలో ధీరూబాయ్ అంబానీ..ఆర్ట్ ఆప్ లివింగ్ రవిశంకర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ,రాజమౌళి,రామోజీరావు..ఇలా ఎవరిని చూసినా కేంద్రానికి బాగా ఊదేవారు..లేదంటే వారి పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేసినవారు..ఇంకా మాట్లాడాలంటే వీరంతా కేంద్రంలోని పెద్దలకు సన్నిహితంగా మెలుగుతుంటారు కూడా..చనిపోయినవారి సంగతి పక్కనబెడితే వారి వారసులను. 

          ఓ వర్గంవారిని ప్రబావితం చేసేందుకే ఇలాంటి అవకాశాలను వాడుకుంటారని ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయ్. తమిళనాట రజనీకాంత్ కానీ..కన్నడనాట ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కానీ..పురస్కారాలకు అర్హులు కాదని కాదు..ఐతే ఇచ్చిన సందర్భం కూడా వివాదాస్పదం అవకతప్పదు..అనుపమ్ ఖేర్ భార్య బిజెపి ఎంపి..అసహనం పరిణామాల నేపధ్యంలో బిజెపికి బాగా మద్దతుగా మాట్లాడాడు అనుపమ్ ఖేర్..అందుకే ఈ పురస్కారం దక్కిందంటే దానికి సమాధానం చెప్పలేం..ఎందుకంటే..అనుపమ్ ఖేర్ కూడా తక్కువస్థాయి నటుడేం కాదు..దాదాపు 40ఏళ్లుగా నటప్రస్థానం సాగించిన వ్యక్తే..ఇక రామోజీరావ్ సంగతి చెప్పక్కర్లేదు..ఇప్పుడు కేంద్రం ఏ పథకం ప్రవేశపెట్టినా..విపరీతమైన అనుకూల కథనాలు వండి వార్చడంలో వారి పత్రిక ముందుందుంటుంది..అందుకే ఢిల్లీ దిల్లీ అయింది..మోడీ మోదీ అయ్యాడు..గత పత్రికల్లో రాసిన పదాలను ఇప్పుడు సవరించుకునేంతగా మార్పులు వస్తే ఇక పురస్కారాలు నడిచి రాకుండా ఉంటాయా అని కాంగ్రెస్ ప్రముఖుడొకరు కామెంట్ చేసాడు
Today Central government announced Padma Shri Awards list. In this list there are lot of business men, and politicians. But by observing this, these awards are favor to central government.