లోకేష్ ఫోటోలు నిజమేనంటున్న టిడిపి ఎమ్మెల్సీ

25 Jan 2016


          కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వారికైనా అర్ధం కాదు. ఇల్లలికిన ఈగలా టీవీఛానళ్లలో చర్చల్లో పాల్గొనడం పెద్దగా పెద్దగా నవ్వడం రోడ్డుమీద మాట్లాడే భాష వాడటంలో సిధ్దహస్తుడు టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. టిడిపి బీట్, కాంగ్రెస్ బీట్..వైఎస్సార్సీపీ బీట్ అని టీవీ ఛానళ్లలో రిపోర్టర్లకు బీట్ లు ఇస్తారు. అలా బీట్ రిపోర్టర్లలా టిడిపి,కాంగ్రెస్ లో జగన్ బీట్ అని కొంతమంది నేతలకు ఇచ్చారని వీళ్లు మాట్లాడే మాటలు చేసే విమర్శలు చూస్తుంటే అన్పించకమానదు. కాంగ్రెస్ లో వీహెచ్, టిడిపిలో సోమిరెడ్డి, వర్లరామయ్య, రాజేంద్రప్రసాద్ లు ఎప్పుడూ ఈ పనే చేస్తుంటారని వారి వ్యాఖ్యలను గమనిస్తే అర్ధం అవుతుంది. 

            ఎక్కడ ఏ అంశం జరిగినా వెంటనే దాన్ని జగన్ కు ఆపాదించడమే వీరి లక్ష్యం, తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వైఎస్ జగన్ కు చాలా మంది హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీనికి కారణం ఏంటంటే.. సాక్షిలో చినబాబు తన ఫ్రెండ్స్, గాళ్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు ప్రచురించడమే. సాక్ష్యాలుంటే ఇలా ఉండాలంటూ ఆ కథనానికి స్పందించిన  రాజేంద్రప్రసాద్ గారు ఇలా తయారైపోయారు ఐతే ఇక్కడ ఓ విషయం మర్చిపోయాడాయన నారా లోకేష్ ఫోటోలు తప్పుడువి కాదనలేదు నిజమైనవే అని చెప్పారు. పైగా జగన్ సీక్రెట్లు తనకి తెలుసున్నారు నిజంగా అంత సీక్రెట్లనేవి ఏవైనా ఉంటే టిడిపి వాటిని బైటపెట్టకుండా ఉంటుందా.

Recently Sakshi TV telecast a program about Nara Rohit and his photos with friends in foreign. For this TDP MLC Rajendra Prasadh reacted and i have photos of YS Jagan with heroins.