బన్నీతో పవన్ కు ప్యాచప్ అయిందా..?

14 Jan 2016                    మెగా కాంపౌండ్ లో ఎప్పుడేం జరుగుతుందో  ఎవరికీ తెలియదు..తమ్ముడికీ అన్నయ్యకు పడదంటారు..బన్నీకి పవన్ కు గ్యాప్ ఉందంటారు..బాబాయ్ అబ్బాయ్ కీ చెడిందంటారు..అంతలోనే మేమంతా ఒకటే అని ప్రకటించేస్తుంటారు..ఇవన్నీ ఎవరూ పట్టించుకోకపోయినా..మీడియా అందులోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో బోలెడు కథనాలు వస్తుంటాయ్..ఇలా వచ్చే ప్రతీ స్టోరీని ఖండించాలంటే కష్టమే..కానీ ఏదో కొత్తగా పరిచయమైన స్నేహితుడికో..దూరపుచుట్టం ఇంటికో వెళ్తున్నట్లు బొకేలు పట్టుకుని వెళ్లడం ఆ తర్వాత ఫోటోలకు పోజిలివ్వడం చూస్తే..మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే సంకేతాలివ్వడానికే అని అర్ధం అవుతుంది..వాస్తవాలు..అవాస్తవాలు సంగతి పక్కనబెడితే..పవన్ కల్యాణ్ కు బన్నీకి పడట్లేదని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది( ఇది వాస్తవం అని మేం చెప్పడం లేదు ఇది గమనించాలి) అందుకే చిరంజీవిని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ బన్నీ రుద్రమదేవి ఆడియో ఫంక్షన్లో పొగిడాడు..దాసరి-పవన్ బేటీ సమయంలో దాసరి కన్వీనెంట్ గా చిరు ప్రస్తావన తీసుకురానందుకు ప్రతిగా ఇది జరిగిందంటారు..
              ఐతే ఇప్పుడు ట్విట్టర్,ఫేస్ బుక్ లో ఓ హడావుడి బాగా చోటు చేసుకుంది..బన్నీ కొడుకుకు ఏడాది వయస్సుంటుంది..అతను పవన్ కల్యాణ్ నటిస్తోన్న సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ గెస్ట్ క్యారెక్టర్ లో కన్పించబోతున్నాడన్నదే ఆ న్యూస్. ఇప్పటికే అల్లుళ్లు ,మేనల్లుళ్లతో ఆన్ సెట్స్ ఫోటోలతో ఇరగదీస్తున్న ఈ సినిమా కవరేజ్ దీంతో మరింత హైప్ ను మెగా ఫ్యాన్స్ లో క్రియేట్ చేస్తోంది..ఇదెంత వరకూ నిజమన్నది సినిమా రిలీజైతే కానీ తెలీదు..Mega family is always sensational news to Media. Again Mega family is hot news in social websites. Present a clash between Bunny and Pavan Kalyan is running.