అప్పట్లో ఎన్టీఆర్..ఇప్పుడు రజనీకాంత్

22 Jan 2016


       రజనీకాంత్ సినిమాలు ఫ్లాపైనా హిట్టైనా సెన్సేషన్  ఒకేలా ఉంటుంది.. లింగా కు ముందు వచ్చిన కొచ్చాడయాన్ చాలామంది మర్చిపోయి ఉంటారు.. ఇది ఏ భాషలోనూ ఎవర్నీ అలరించలేదు.. ఇంతలా ఫ్లాప్ అయిన సినిమా మరోటి రజనీది లేదు..ఐతే ఇదికేవలం ఓ కార్టూన్ మూవీనే కాబట్టి..ఓ సినిమాగా కూడా ఎవరూ పట్టించుకోరు..ఐతే రజనీకుమార్తె సౌందర్య ఇప్పుడు ఈ రాణా ను కన్నడంలోకి డబ్ చేయబోతోంది.. అసలు కర్నాటకలో డబ్బింగ్ సినిమాలకు పర్మిషన్ లేదు.. తమిళతంబిలకే కాక..కన్నడ కంఠీరవులకూ ప్రాంతీయాభిమానం ఓ రేంజ్ లో ఉంటుంది.. ఇప్పుడందుకే ఈ డబ్బింగ్ అంశం సెన్సేషన్ అవుతోంది.. ఈ డబ్బింగ్ సినిమాలపై బ్యాన్ ఇప్పటిది కాదట..యాభైఏళ్ల నుంచి కన్నడ సినిమాలకు దెబ్బ తగలకుండా ఈ నిషేధం కాపాడుతోంది..చిరంజీవి,మహేష్,నాగార్జున సినిమాలు తెలుగులోనే మైసూర్, బెంగళూరులో రిలీజై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తుంటాయ్..అసలు అక్కడ పది రోజులు పాతికరోజులు ఆడినా..కూడా పెద్ద ఫంక్షన్లు చేసుకుంటుంటారు..ఈ విషయాన్నే డైలాగ్ కింగ్ సాయికుమార్ అప్పుడప్పుడు చెప్తుంటారు కూడా.. ఈ రీసెంట్ డెవలప్ మెంట్ తో యాభైఏళ్ల క్రితం మన ఎవర్ గ్రీన్ మాయాబజార్ డబ్బింగ్ అయిన చివరి సినిమాగా తెలుస్తోంది.. ఇప్పుడు రజనీకాంత్ కొచ్చడయాన్ డబ్ అవబోతోంది.. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా..ఇక రజనీ తర్వాత మనోళ్ల సినిమాలు డబ్ అవుతాయనడంలో డౌట్ లేదు.

Kollywood Super Star Rajanikanth is always hot topic, Recently he did movie Koccadayan all the people saying it is the remake of Mayabazar.