అమ్మయ్య నాకో పదవి

28 Jan 2016


                   టిడిపిలో నన్నపనేని రాజకుమారికి ఎప్పట్నుంచో ఓ మంచి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఆమె చాలా సందర్భాల్లో అది వెళ్లగక్కారు కూడా ఐతే పదవి ఇస్తేనే పని చేస్తా అని కాదు కానీ. పార్టీకోసం కష్టపడుతుంటే నన్ను వదిలేసి ఇతరులకు పదవులు దక్కడం ఏంటని ఆవేదన చెందేవారామె. ఇప్పుడామెకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రెసిడెంట్ పదవి దక్కింది  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ రిలీజ్ చేసింది. 
            ఐతే కమిషన్ లో సభ్యులు మాత్రం ఇంకా ఎవరెవరో తేలలేదు. అంటే సైనికులు లేని రాజ్యానికి సైన్యాధ్యక్షురాలన్నమాట ఐదేళ్ల పాటు నన్నపనేని ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఏపీ మహిళా కమిషన్‌ 1998 చట్టం 9వ నిబంధన ప్రకారం ఈ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్తోంి. ఐతే ఈ నియామకం జరిగిన సమయాన్ని కొంతమంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రోజాపై లీగల్ వార్ చేస్తున్న టిడిపి, ఆమెకు ధీటుగా నన్నపనేనిని వాడుకునే అవకాశాన్ని పరిశీలిస్తుందని టాక్ ఎవరిచేతనో ఫిర్యాదులు చేయించడం. ఆ తర్వాత మహిళా కమిషన్ పేరిట రోజాపై చట్టపరమైన చర్యలంటూ కాస్త హడావుడి చేస్తారని అంటున్నారు.
TDP mahila leader is Nanapaneni Rajakumari now get a post in TDP. Now she is elected as AP state Mahila Commissioner. She is waiting for that post.