అతడే ఒక సైన్యం+ఒక్కడున్నాడు= నాన్నకు ప్రేమతో

13 Jan 2016


మూడు సినిమాలు కలిపి కొడితే నాన్నకు ప్రేమతో తయారైందా..ఇదే డౌట్ చూసినవాళ్లు, కథ విన్నవాళ్లు అంటున్నారు..స్థూలంగా తెలుగు సినిమాలకు కథ దొరకడంలేదనే కామెంట్ ఎప్పుడూ విన్పిస్తూనే ఉంటుంది..అలానే కథలు కొత్తగా దొరకవు..అవే రూపం మార్చుకుని వస్తుంటాయనే వాళ్లూ ఉన్నారు..ఇప్పుడు విడుదలైన జూనియర్ సినిమా కూడా అదే పాయింట్ కు బలం చేకూర్చుతుందంటున్నారు.. తండ్రిని మోసం చేసి ఆస్తుల లాక్కున్న విలన్ ని హీరో తెలివిగా దెబ్బ కొట్టడం ఇదే కామన్ పాయింట్ పైన చెప్పిన సినిమాల్లో..ఐతే ఇందులో పాత్రధారులు..ఒకసారి హీరోగా..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తర్వాత విలన్ గా కన్పించడమే విచిత్రం అన్పిస్తోంది.. అతడే ఒక సైన్యం అనే సినిమాలో సుమన్, జగపతిబాబు నటించారు...అందులో చిట్ ఫండ్స్ కంపెనీ నడుపుతాడు సుమన్..అతనిని మోసం చేసి చనిపోయేలా చేస్తాడు విలన్ ప్రకాష్ రాజ్.. ఇది ఎస్వీ కృష్ణారెడ్డి స్టైల్లో జరిగే రివెంజ్ కామెడీ అవడంతో పెద్దగా పేల్లేదు..తర్వాత ఒక్కడున్నాడు మూవీలో ఇదే సుమన్ చిట్ ఫండ్స్ లో మోసం చేస్తున్నాడంటూ పరువు తీస్తారు..దానిని తీర్చడం కోసం ముంబైలో ఉన్న బంగ్లా అమ్మి డబ్బులు తీసుకురావడానికి గోపీచంద్ బయల్దేరతాడు..ఇప్పుడు నాన్నకు ప్రేమతో కథనం..పాత్రధారులు..రిచ్ లుక్ వేరు గానీ..ఇదే థీమ్ తో నడుస్తుంది..తన తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకోవడం..ఈ మధ్య అవేర్ నెస్ పెరిగిపోవడంతో ఫస్ట్ షోకే ఇలాంటి కామెంట్లు వస్తున్నాయని అంటున్నారు. స్టోరీ లైన్ ఏదైనా సినిమా ఫేట్ ఏంటనేది తొందర్లోనే తేలిపోనుంది

NTR movie is released today. It is the combination of two old stories. There is now variety in story, it is the old concept. Fans were disappointed with this.