తప్పులు చేయాల్సిందే నేర్చుకోవాల్సిందే అంటున్న నాగ్

20 Jan 2016


        అఖిల్ డిజాస్టర్ నుంచి చాలా రోజులు తేరుకోలేకపోయానని నాగార్జున ఇప్పుడు ఓపెనైపోయారు..ఐతే సినిమా ప్రమోషన్ల చేస్తున్నప్పుడే చాలామంది ఈ విషయం అడిగినా పెద్దగా స్పందించని నాగ్ ఇప్పుడు మాత్రం అఖిల్ సినిమాల విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు..ఫ్లాప్ ల నుంచి నేను నేర్చుకున్నట్లే కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా నేర్చుకోవాలని చెప్పాడు.. ఇలా చెప్పడం ద్వారా అఖిల్ సినిమా విషయంలో తన జోక్యం లేదని చెప్పినట్లైంది.. ఓవరాక్షన్ తో ఆ సినిమాను చెడగొట్టిన క్రెడిట్ ఇప్పుడు వినాయక్, అఖిల్ కే కట్టబెట్టాడు.. ఆ మధ్య వినాయకే డైరక్ట్ గానే తనని క్షమించమంటూ అక్కినేని ఫ్యాన్స్ కు విన్నవించుకున్నాడు కూడా..ఐతే ఇప్పుడు సోగ్గాడే...చిన్నినాయన సినిమా బాగా పోతుందనే టాక్ నడుస్తోంది..ఈ ఉత్సాహంలో గత వాస్తవాలను ఏకరువు పెడుతున్నాడు నాగ్. వాళ్ల కెరీర్ లో జోక్యం చేసుకోనని చెప్తున్న నాగ్..ప్రేమమ్ రీమేక్ విషయంలో నాగచైతన్యకు సూట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు..త్వరలోనే ఓ మంచి కథ దొరికితే ముగ్గురం నటిస్తామని కూడా నాగార్జున అంటున్నాడు..ఐతే మనం సినిమా విషయానికి వస్తే అది డిఫరెంట్ స్టోరీ..అలాంటి కథ ప్రతిసారీ దొరకాలంటే కష్టమే..చాలా రోజులకు సోలోగా హిట్ కొట్టిన నాగ్ కు ఇప్పుడు పుత్రోత్సాహం కరువు అయింది..పైకి  ఎన్ని మాటలు చెప్పినా అఖిల్ కు హిట్ పడేదాకా ఆయనలోని తండ్రి విశ్రమించరని తెలుస్తూనే ఉంది..పైగా అఖిల్ షూటింగ్ సమయంలో తన మాట అఖిల్ వినలేదని..ఇప్పుడు తన హిట్ తో అయినా..ఎక్స్ పీరియెన్స్ మహిమ ఏంటో తెలియవస్తుందని నాగ్ అభిప్రాయపడుతున్నాడట

Yesterday Nagarjuna commented on Akil movie disaster, till now he is passing to talk about it. He said that i will never involve in Akil movies, he have to learn from his failures.